నా భర్త అమేజింగ్ పర్సన్, పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ గురించి లావణ్య కామెంట్స్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

Published : Nov 18, 2023, 06:58 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

PREV
18
నా భర్త అమేజింగ్ పర్సన్, పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ గురించి లావణ్య కామెంట్స్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 

28

గత కొన్నేళ్లుగా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తున్న వరుణ్, లావణ్య తాము మొట్ట మొదటి సారి కలసిన చోటే పెళ్లి చేసుకున్నారు. వరుణ్, లావణ్య మిస్టర్ మూవీ షూటింగ్ కోసం తొలిసారి ఇటలీలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయమే ఇన్నేళ్ళలో ప్రేమగా మారింది. 

38

వరుణ్, లావణ్య వివాహం, రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగాయి. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. నవ వధూవరులని ఆశీర్వదించారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలిసారి వరుణ్ తేజ్ గురించి కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేసింది. 

48

లావణ్య త్రిపాఠి అందమైన పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. నా భర్త జాలి, కేరింగ్ కలిగిన ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. కానీ నాలోనే దాచుకుంటాను. మా మూడు రోజుల పెళ్లి ఎంతో అద్భుతంగా ఒక డ్రీం లాగా జరిగింది. 

 

58

మమ్మల్ని ఆశీర్వదించిన, బెస్ట్ విషెష్ అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు అని లావణ్య ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా లావణ్య షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

68

లావణ్య త్రిపాఠి ధరించిన పెళ్లి చీరకి ఒక ప్రత్యేకత ఉంది. చీరపై వరుణ్ లవ్ అని రాసి ఉన్న డిజైన్ ని కూడా లావణ్య రివీల్ చేసింది. కాళ్లకు పారాణి, పట్టీలని కూడా చూపించింది. ఈ ఫొటోలో మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య ఫ్యామిలీని కూడా చూడొచ్చు. 

78

  లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. స్కూల్ విద్యాబ్యాసం డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. లావణ్య త్రిపాఠికి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.   

88

  ఇక సినిమాల్లో తొలి ఛాన్స్ ఆమెకి 2012లో దక్కింది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.   

Read more Photos on
click me!

Recommended Stories