Bheemla Nayak Fight Scene: పవన్‌, రానాల ఫైట్‌ సీన్‌ అక్కడి నుంచే లేపేశారా? త్రివిక్రమా? మజాకా? హాట్‌ టాపిక్‌

Published : Mar 02, 2022, 06:36 PM IST

పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్‌` చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఓ ఫైట్‌ సీన్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అది ఎక్కడి నుంచి లేపేశారో పోలుస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు.   

PREV
16
Bheemla Nayak Fight Scene: పవన్‌, రానాల ఫైట్‌ సీన్‌ అక్కడి నుంచే లేపేశారా? త్రివిక్రమా? మజాకా? హాట్‌ టాపిక్‌

`భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రం శుక్రవారం విడుదలై ఫస్ట్ షో నుంచి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. మలయాళ మాతృకని మించిన కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయంవ్యక్తమవుతుంది. Pawan అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ రన్‌ అవుతుంది. అయితే మొదటి మూడు రోజులున్నంత ఊపు ఇప్పుడు లేదనే టాక్‌ వినిపిస్తుంది. 

26

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సరికొత్త వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో రానా(Rana), పవన్‌(Pawan Kalyan) మధ్య హోరా హోరీగా ఫైట్‌ సీన్లుంటాయి. ఎప్పుడు కలిసినా వీరిద్దరి మధ్య గట్టిగా వాదన జరుగుతుంది. నువ్వా నేనా అనేలా పోటీ పడుతుంటారు. ఒకరిపైకి ఒకరు విరుచుకుపడుతుంటారు. ఈ సీన్లు అభిమానులకు ఊపుని తీసుకొస్తుంటాయి. థియేటర్లో ఉద్రేకానికి గురి చేస్తుంటాయి. పవన్‌, రానా మధ్య వచ్చే క్లైమాక్స్  ఫైట్‌ సీన్లు కూడా చాలా సహజంగా ఉంటాయి. దీంతో హైలైట్‌గా నిలిచాయి. 

36

ఇదిలా ఉంటే ఈ ఫైట్ సీన్లు ఫలానా దాంట్లోనుంచి లేపేశారనే టాక్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. క్లైమాక్స్ ఫైట్‌ సీన్లు రామాయణంతో పోలుస్తున్నారు నెటిజన్లు.  మాతృక(మలయాళం)లో అయ్యప్ప నాయర్ ప్రత్యర్థిని కౌగిలిలో బిగించి చంపడానికి ప్రయత్నిస్తారు. దీన్ని తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ రానా మెడపై కాలు పెట్టి కాలుతో తొక్కి పెట్టడం ద్వారా చంపడానికి ప్రయత్నిస్తారు.

46

రామాయణంలో  సుగ్రీవుడితో వాలి యుద్ధం చేసేటప్పుడు తన కాలిని సుగ్రీవుడు భుజంపై పెట్టి తన చేయిని గట్టిగా పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తాడు. అలా చేయడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ ఆగిపోయి.. గుండెపోటు వచ్చి చనిపోతారు. అచ్చం `భీమ్లా నాయక్` సినిమాలో కూడా రానా, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని డిజైన్‌ చేశారు.  రానా భుజంపై కాలు పెట్టి తనను చంపాలనుకునే సీన్‌ని క్రియేట్‌ చేశారు. 

56

`రామాయణం` నుంచి ఈ ఫైట్ సీన్ ను కాపీ కొట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామాయాణంలో వాలీ, సుగ్రీవుల మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సన్నివేశం ఆధారంగా ఈ సీన్ ను తీర్చిదిద్దారని పోల్చి మరీ చూపిస్తున్నారు. వాలీ, సుగ్రీవులు హోరాహోరీగా ఫైట్‌ చేసుకుంటారు. ఆ చిత్రాలను, భీమ్లా నాయక్‌లోని పవన్‌, రానాల ఫైట్ సీన్లని మిక్స్ చేసి అక్కడి నుంచి ఈ సీన్లని తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. 

66

అయితే ఈ ఫైట్‌ సీన్లని `రామాయణం` నుంచి ఇన్‌స్పైర్‌ అవ్వడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కారణమంటున్నారు. ఆయనకే పౌరాణిక, పురణాలు, ఇతిహాసాలపై పట్టుకుంది. తాను రూపొందించిన చాలా చిత్రాల్లో ఇలాంటి మైథలాజికల్‌ అంశాలను జోడిస్తుంటారు. `అత్తారింటికి దారేది`లో క్లైమాక్స్ కి ముందు వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్‌ కూడా ఇలా పురణాల నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యిందే. అలాగే `భీమ్లా నాయక్‌`లో కూడా రామాయణంలో వాలీ, సుగ్రీవల ఫైట్‌ సీన్‌ నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యారని, త్రివిక్రమా? మజాకా? అంటున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంతో గానీ ఇప్పుడిది వైరల్‌గా, హాట్‌ టాపిక్‌గా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories