ఏపీలో 180 స్క్రీన్లలో ‘జల్సా’ ప్రదర్శించబడుతుండగా చాలా చోట్ల హౌజ్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్, దేవీ 70 ఎంఎం, గచ్చిబౌలిలోని ఏఎంబీ, ప్రసాద్ ఐమాక్స్ లోనూ హౌజ్ ఫుల్ అయినట్టు సమాచారం. మహేశ్ బాబు ‘పోకిరి’కి ధీటుగా పవన్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ‘జల్సా’ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.