సమంత(Samantha).. ఈ పేరు ఇప్పుడొక సెన్సేషనల్. హాట్ టాపిక్. వివాదాలకు కేరాఫ్. పడలేచిన కెరటం. ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. స్ట్రాంగ్ ఉమెన్.స్టార్ హీరోయిన్. ఇవన్నీ కలిపితే సమంత. అవును.. చైతూతో విడాకుల తర్వాత ఆమె ద్వారా జనానికి తెలిసినవి, తలోని దాగున్న అనేక శక్తులను బయటకు తీసింది.
సమంత మొన్నటి వరకు వార్తల్లో పేరుగా, బ్రేకింగ్ న్యూస్‌గా నిలుస్తూ వస్తోంది. ఆమె చేసే కామెంట్లు, పోస్ట్ లు సంచలనంగా మారిన విషయంతెలిసిందే. తనచూట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది వివాదంగా, చర్చల్లో పాయింట్ గా మారుతుంది. దీంతో సమంత ఏకంగా సోషల్ మీడియాకే దూరంగా ఉంటోంది.
తాజాగా Samantha సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటుందో తెలిసిపోయింది. తన చుట్టూ వివాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సామ్ నిర్ణయించుకుందట. తనపై వచ్చే పోస్టులు, వార్తలు చదివి చాలా డిస్టర్బ్ అవుతూ తను కూడా ఏదో ఒకటి రియాక్ట్ కావడం,మళ్లీ అది వివాదంగా మారుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాకి దూరం ఉండటమే బెటర్ అని నిర్ణయించుకుందట సమంత.
అయితే ఇదే కాదు సమంత సోషల్ మీడియాని పక్కన పెట్టడానికి మరో కారణం కూడా ఉందట. ఆమె హిందీలో రాజ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. హాలీవుడ్ రస్సో బ్రదర్స్ రూపొందించిన `సిటాడెల్`ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగే సిరీస్ ఇది. హిందీలో సమంత ప్రధాన పాత్రలో నటించబోతుంది.
ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో విక్కీ కౌశల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరుఫైనల్ అవుతారనేది తెలియాల్సి ఉంది. వరుణ్ పేరు ముందుగా వినిపించగా,ఇప్పుడు విక్కీ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరో ఎవరైనా సమంత కామన్.
ఈ సిరీస్ కోసం సమంత మార్షల్‌ఆర్ట్స్ నేర్చుకుంటుందట. పూర్తిగా వాటిపైనే ఫోకస్ పెట్టి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాలని భావిస్తుందట. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో సమంత బిజీగా ఉందని, దీని కారణంగానే ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉందని అంటున్నారు. మూడు నెలలపాటు ఈ శిక్షణలోనే సమంత ఉంటుందట.సినిమాలో ఆమె చేసే యాక్షన్స్ వేరే లెవల్‌లో ఉంటాయని అందుకే ఇంతగా కష్టపడుతుందని సమాచారం.
ఇది కాకుండా సమంత వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగానే ఉంది. తెలుగులో ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. ఈమూడు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. దీంతోపాటు హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్, తాప్సీ ప్రొడక్షన్‌లో సినిమాలకు కమిట్ అయినట్టు సమాచారం. అలాగే ఓ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.