పూరీని విజయ్ పక్కన పెట్టాడా.! ‘జన గణ మన’ పరిస్థితి ఏంటీ?

Published : Aug 29, 2022, 04:50 PM IST

‘లైగర్’ పరాజయంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తీసుకుంటున్న నిర్ణయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఈక్రమంలోనే విజయ్ పూరీని పక్కకు పెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో వీరి కాంబినేషనల్ లో రానున్న ‘జన గణ మన’ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.!  

PREV
16
పూరీని విజయ్ పక్కన పెట్టాడా.! ‘జన గణ మన’ పరిస్థితి ఏంటీ?

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్ కు చుక్కెదురైంది. 
 

26

దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తోపాటు, విజయ్ కూడా కాస్తా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలకు విజయ్ ఒకే చెప్పగా.. రౌడీ స్టార్ ఇకపై ఎలాంటి మూవ్ తీసుకోబోతున్నాడనేది అందరిలో ఉత్కంఠను రేపుతోంది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’పైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

36

Liger ఇచ్చిన షాక్ నుంచి విజయ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. లైగర్ మూవీ రిలీజ్ కు ముందే మాస్ డైరెక్టర్ పూరీతో మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘జన గణ మన’ (Jana Gana Mana)ను విజయ్ - పూరీ కలిసి గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. అయితే ‘లైగర్’ ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
 

46

ఊహించని విధంగా ‘లైగర్’ దెబ్బేయడంతో విజయ్ పూరీని ప్రస్తుతం పక్కకు పెట్టారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో పూరీతో మళ్లీ షూటింగ్ కొనసాగిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయోనని ముందే జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం అందుతోంది.  ఈ సందర్భంగా విజయ్ JGM సినిమాను ప్రస్తుతం పక్కన పెట్టారని అంటున్నారు. 
 

56

ఈ క్రమంలోనే విజయ్ - సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi) చిత్రంపై రౌడీ స్టార్ ఫోకస్ పెట్టారని సమాచారం. ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాలని విజయ్, ఆయన ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా సెప్టెంబర్ లోనే షూటింగ్ మొదలెట్టనున్నట్టు సినీ విశ్లేషకులు అంటున్నారు. 

66

మరోవైపు ‘లైగర్’ తెచ్చిపెట్టే నష్టాలను పూడ్చుకొనే వరకే ప్రొడ్యూసర్ ఛార్మీకి సమయం పడేట్టు కనిపిస్తోంది. అప్పటికే అన్నీ కుదిరితేనే ‘JGM’ ముందుకు కదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కేవలం అనౌన్స్ మెంట్ మాత్రమే చేసి, షూటింగ్ ను ప్రారంభించకపోవడంతో విజయ్ కూడా సినిమాను చేస్తారా? లేదంటే వదిలేస్తారా? అని నెటిజన్లు సందేహిస్తున్నారు. చూడాలీ మరీ మున్ముందు విజయ్ ఈ పరిస్థితులను ఎలా దాటుకెళ్తారనేది.

Read more Photos on
click me!

Recommended Stories