హోస్ట్ గా బాలయ్య ఎలా ఉంటుందో, షో క్లిక్ అవుతుందా? బాలయ్య చేయగలడా అనే రూమర్స్ నుంచి అత్యంత టీఆర్‌పీ రేటింగ్ సాధించిన షోగా `అన్‌స్టాపబుల్` నిలిచింది. ఇందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను ఆహ్వానించి తనదైన స్టయిల్‌లో బోల్డ్ గా ప్రశ్నలు సందించి అనేక కొత్త విషయాలను బయటకు తీశారు బాలయ్య. మొదటి సీజన్‌లో బాగానే సెలబ్రిటీలు సందడి చేశారు. మహేష్, బన్నీ, రవితేజ, మోహన్‌బాబు, రాజమౌళి, నాని వంటి స్టార్స్ సందడి చేసిన విషయం తెలిసిందే.