
పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ మరో నాలుగు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడబోతుంది. ఈ మూవీ కోసం పవన్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
పైగా పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో అభిమానుల్లోనే కాదు, కామన్ ఆడియెన్స్ లోనూ ఆసక్తి ఏర్పడింది. సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
అయితే `హరి హర వీరమల్లు` సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు పట్టింది. పలు మార్లు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో షూటింగ్ చేయడం కుదరలేదు. అంతకు ముందు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
రిలీజ్‌కి సంబంధించిన డేట్స్ ప్రకటించినా, వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇటీవల కాలంలోనే రెండు మూడుసార్లు వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ మూవీ జులై 24న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
`హరి హర వీరమల్లు` సినిమా బిజినెస్‌కి సంబంధించి రకరకాల ప్రచారం ఉంది. బయ్యర్లు ఆసక్తి చూపించలేదనే టాక్ ఉంది. మరోవైపు నిర్మాత ఏఎం రత్నం సొంతంగానే రిలీజ్‌కి వెళ్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
సినిమాని కంప్లీట్ చేయడానికి పవన్ తన సగం పారితోషికం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందట. మరోవైపు సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ బాగా చేయలేకపోయారు.
తెలుగులో ప్రమోషన్స్ బాగానే ఉన్నా, ఇతర భాషల్లో ప్రమోషన్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాని నిలబెట్టేందుకు పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారట.
`హరి హర వీరమల్లు` సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారట. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన నడుంబిగించినట్టు తెలుస్తోంది.
నిర్మాతని బతికించేందుకు పవన్ తనవంతు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినట్టు టాక్. అందులో భాగంగా సోమవారం `హరిహర వీరమల్లు` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆయన హాజరు కానున్నారు.
దీంతోపాటు ఈ ఈవెంట్‌కి ముందే ఓ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో కూడా ఆయన హాజరు కానున్నట్టు తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయన సినిమా మీడియాని కలవబోతున్నారని చెప్పొచ్చు.
ఇదే కాదు పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారట పవన్. టీమ్ ఇంటర్వ్యూలు, పలు బిగ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలని, అలాగే ఇతర స్టేట్స్ లో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో `సర్దార్ గబ్బర్ సింగ్`, `కాటమరాయుడు` సినిమాల సమయంలో ఇలా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు పవన్. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన ఇలాంటి మీడియా ప్రమోషన్స్ చేయలేదు.
కేవలం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యేవారు. ఇప్పుడు `హరి హర వీరమల్లు` కోసం, నిర్మాత ఏఎం రత్నం కోసం ఆయన తన రూల్స్ అన్నింటిని పక్కన పెట్టబోతున్నారు.
డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, వాటి రిలేటెడ్ రూల్స్ అన్ని పక్కన పెట్టి ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేశారు. ఆయనది ఔరంగజేబ్ పాత్ర అని సమాచారం.
ఇందులో పవన్ ఆంధిగా కనిపించబోతున్నారు. విష్ణువు, శివుడి ప్రతిరూపమైన వీరమల్లుగా కనిపిస్తారని తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మించిన ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
క్రిష్ మూవీ నుంచి తప్పుకోవడంతో జ్యోతి సినిమా పగ్గాలు తీసుకున్నారు. తనదైన స్టయిల్‌లో ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని తీర్చిదిద్దారట.