మొదటిసారి బయటకొచ్చిన పవన్‌ కళ్యాణ్ భార్య.. అనాథ పిల్లలతో కలిసి అనా కొణిదెల క్రిస్మస్‌ వేడుకలు.. ఫోటోలు

Published : Dec 24, 2023, 11:02 PM ISTUpdated : Dec 25, 2023, 07:20 AM IST

పవన్‌ కళ్యాణ్‌ భార్య అనా కొణిదెల తాజాగా పబ్లిక్‌లో సందడి చేశారు. ఆమె అనాథ పిల్లలతో కలిసి క్రిస్మస్‌ వేడుకలో పాల్గొన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.  

PREV
17
మొదటిసారి బయటకొచ్చిన పవన్‌ కళ్యాణ్ భార్య.. అనాథ పిల్లలతో కలిసి అనా కొణిదెల క్రిస్మస్‌ వేడుకలు.. ఫోటోలు

పవన్‌ కళ్యాణ్‌ భార్య అనా కొణిదెల (లెజినోవా) సాధారణంగా ఎప్పుడూ బయటకు రారు. ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి, ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. పవన్‌ తోనూ పెద్దగా కనిపించదు. మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్ప, ఆమె బయటకు కనిపించింది చాలా అరుదు. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్ట్ ల్లో సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె పబ్లిక్‌లోకి వచ్చింది. మొదటి సారి ఆమె పబ్లిక్‌లో కనిపించి ఆశ్చర్య పరిచింది. 
 

27

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ భార్య అనా.. అనాథ పిల్లలను కలిసింది. అనాథాశ్రమంలో ఆమె సందడి చేసింది. అనాథ పిల్లల సమక్షంలో ఆమె  క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ది చిల్ట్రన్‌ సంస్థకి ఆదివారం అన్నా సందర్శించారు. 

37

అనాథ పిల్లలతో కలిసి కాసేపు అనా సరదాగా గడిపారు. వారితో ముచ్చటించారు. చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. వారి విద్యా బుద్దుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమక్షంలోనే కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకున్నారు. 
 

47

అంతేకాదు అనాథాశ్రమం కోసం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా అనా కొణిదెలని ఎన్జీవో నిర్వాహకులు సత్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలను నిర్వహకులు పంచుకున్నారు. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

57

జనరల్‌గా అనా కొణిదెల ఇలా బయటకు రారు. చాలా అరుదు. కానీ ఇప్పుడు క్రిస్మస్ వేళ ఆమె ఇలా సేవా కార్యక్రమంలో పాల్గొనడంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషి అవుతున్నారు. ఆమెకి క్రిస్మస్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు. 
 

67

ఇక 2013లో పవన్‌.. అనా లెజినోవాని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అప్పటికే పవన్‌కి రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. 

77
pawan wife

 అనాని `తీన్‌మార్‌` సినిమా సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు పోలెనా అంజనా, కుమారుడు మార్క్ శంకర్‌ పవనోవిచ్‌ ఉన్నారు. అమ్మ అంజనాదేవి, నాన్న పేర్లు వచ్చేలా తన పిల్లలకు పవన్‌ ఈ పేర్లు పెట్టడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories