షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ఆస్తుల పై అజయ్ దేవగణ్ క్లారిటీ. ఎవరికి ఎక్కువ ఆస్తున్నాయంటే..?

Published : Dec 24, 2023, 10:35 PM IST

బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు షారుఖ్, సల్మాన్. అంతే కాదు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోలుగా నిలిచారు. మరి వీరిద్దరి ఆస్తుల విలువెంత..? ఇంద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. 

PREV
16
షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ఆస్తుల పై అజయ్ దేవగణ్ క్లారిటీ. ఎవరికి ఎక్కువ ఆస్తున్నాయంటే..?

బాలీవుడ్ లో టాప్ హీరోలంటేగుర్తొచ్చేది ముందుగా  షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీరిద్దరికి  ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరి నుంచి ఎన్నో సూపర్ హిటి సినిమాలు వచ్చాయి. తమ నటనతో ప్రేక్షకుల హృదయాలు దోచుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు కష్టపడి పైకి వచ్చి.. కోట్లు సినిమా ద్వారా కోట్లు సంపాదించిన హీరోలుగా వీరికి పేరుంది. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా పేరున్న వీరిలో రిచ్చెస్ట్ హీరో ఎవరు..? 

26

ఇద్దరూ  హీరోలు వేల కోట్లకు అధిపతులు. బంగారు భవంతుల్లో బ్రతికే రారాజులు. అయితే ఆస్తుల విషయంలో ఎవరికిఎక్కువ ఆస్తులు ఉన్నాయో తెలుసా..?  ఈ విషయంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ స్సందించారు. వీరిలో ఎవరు ధనవంతులో చెప్పకనే చెప్పారు.  ఇప్పటికీ ఇద్దరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. షారుఖ్, సల్మాన్ ఇద్దరి సినిమాలు కమర్షియల్ హిట్స్ అవుతాయి. కానీ ఇద్దరిలో ఎక్కువ ధనవంతుడు..? అజయ్ దేవగన్ ఏంచెప్పారు.

36

తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 8 కి వరుసగా బాలీవుడ్ స్టార్స్ వచ్చి వెళ్తున్నారు. అందులో భాగంగా.. సీనియర్ హీరో  అజయ్ దేవగన్ తో  పాటు..  నిర్మాత, దర్శకుడు రోహిత్ శెట్టి ఈ షోలో పాల్గొన్నారు. వీరిద్దరూ సింగం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో సందడి చేశారు. 
 

46

ఈ క్రమంలో కరణ్ అడిగిన ప్రశ్నకు అజయ్ సూటిగా సమాధానమిచ్చాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను ఎవరు ఎక్కువ ధనవంతులు అని కరణ్ జోహార్ అజయ్ దేవగణ్ కుప్రశ్న వేశారు. దాంతో అజయ్ దేవగణ్ చాలా తెలివిగా తప్పించుకునే విధంగా సమాధానంచెప్పారు. బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కిస్తే షారుఖ్ ఖాన్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. అందుకే అతనిపై నాకు నమ్మకం ఎక్కువ అని చమత్కరించాడు అజయ్. 

56

ఇక చాలా ఏళ్లుగా కోట్లు గడిస్తున్నాడు  షారుఖ్ ఖాన్. అంతే కాదు కొన్ని వదల కోట్ల బిజినెస్ లు కూడా ఆయన సొంతం.దాందో షారుఖ్ ఆస్తుల విలువ 7 వేల కోట్ల వరకూ ఉంటుంది అని అంచనా.ఆయన ఒక్కడి ఆస్తే ఇంత ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంత ఉండవచ్చు.. అయితే ఇవి దాదాపు గా వేస్తున్న లెక్కలే.. అసలు లెక్కలు ఎవరికీ తెలియవు.. 
 

66

ఇక సల్మాన్ ఖాన్  ఎవెండితెరపై హీరోగానే కాకుండా వ్యాపారం, టెలివిజన్ పై కూడా సంపాదిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, సల్మాన్ నికర ఆస్తుల విలువ 3000 కోట్లకు పైనే ఉంటుందనిఅంచనా.  సల్మాన్ కూడా ఇటు వీటితో పాటు.. రకరకాల బిజినెస్ ల ద్వరాసంపాస్తున్నాడు. 
 

click me!

Recommended Stories