
100 శాతం స్ట్రైక్ రేట్ తో సంచలన విజయం సాధించిన పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ ను ‘తుపాన్ ‘ అంటూ ప్రశంసించారు ఎవరూ ఊహించనంతగా ఏపీ ఎన్నికల్లో జనసేన సునామీ సృష్టించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ గురించిన వార్తలే. పవన్ గురించిన చర్చలే. పవన్ తో తమకున్న అనుబంధాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కు కరాటే నేర్పిన మాస్టర్ షెహాని హుస్సేన్ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత పట్టుదల ఉన్నవాడో ఆ మాటలు చెప్తున్నాయి. అవేంటో చూద్దాం.
చెన్నై బేసెడ్ మార్షిల్ ఆర్ట్స్ ఎక్సపర్ట్ షెహాని హుస్సేన్ అనేక సినిమాలు కూడా చేసారు. ఆయన తనే పవన్ కు కరాటే నేర్పానని గర్వంగా చెప్పుకుంటున్నారు. గురువు గర్వంగా శిష్యుడు గురించి చెప్పుకుంటున్న సమయం ఇది. అదంతా 1990లలో జరిగింది. ఆ రోజులను ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఓ వ్యక్తి ఊరికనే గొప్పవాడు కాదని, దాని వెనక పట్టుదల , కృషి ఉంటాయని, అందుకు ఉదాహరణగా తన శిష్యుడు పవన్ కళ్యాణ్ ని చూపెడుతున్నారు.
షెహాని హుస్సేన్ మాట్లాడుతూ... “1990లో నేను కరాటే నేర్పటం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడపటంలో బిజీగా ఉండేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ దాదాపు నెల పాటు నా దగ్గరకు రోజూ వచ్చి కరాటే నేర్పమని అడిగేవారు. నేను ఏజన్సీ పనుల్లో బిజీగా ఉండేవాడిని. నేను ఈ మధ్యన కరాటే నేర్పించడం మానేశాను అని వెళ్లిపోమన్నాను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంటాను అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్ ఓ సామాన్యమైన వ్యక్తిలాగ టీ తెచ్చి పెట్టి మాకు ఇచ్చేవారు. నేను అతని ట్యూటర్ గా చాలా గౌరవంగా చూసి ఏ పని పడితే అది చేసేవారు. కొన్నిసార్లు మా రూమ్ క్లీన్ చేసేవారు. మాతో పాటు ఉండేవారు. అలా ఏడాదిపాటు ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అప్పటికి పవన్ చిరంజీవి తమ్ముడనే విషయం తమకి తెలియదు అన్నారు.
“దాదాపు మూడు నాలుగు నెలలు ఓ సామాన్య వ్యక్తిలా మా దగ్గర మార్షిల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుని తను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మాకు మాకు అసలు విషయం తెలిసింది. ఆయన మెగాస్టార్ తమ్ముడు కల్యాణ్ కుమార్ అని. అలాగే పవన్ చాలా వేగంగా మార్షిల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అతనో స్పెషల్ స్టూడెంట్ అని చెప్పుకొచ్చారు. మా దగ్గర ఉండగానే బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు అని చెప్పారు.
అలాగే పవన్ కృషి గురించి చెప్తూ.. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన కొత్తలో మార్నింగ్ 5:00 నుండి నైట్ 11:00వరకు నా దగ్గరే ఉండు నేను ఖాళీగా ఉన్న టైంలో ఒక అకగంట నీకు కరాటే నేర్పిస్తాను అని చెప్పాను. పవన్ పట్టుదల ఉందా లేదా సరదాగా వస్తున్నారా అనే పరీక్ష లాంటిది అది. అప్పుడు ఒక 15 రోజుల పాటు మార్నింగ్ నుండి నైట్ వరకు నీ దగ్గరే ఉండి అన్ని పనులు చేసుకునే వారు అని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ డెడికేషన్ చూసిన షహాని మాస్టర్ పవన్ కళ్యాణ్ కి సంవత్సరం పాటు కోచింగ్ ఇచ్చారు. అలా ఆయన శిక్షణలో బ్లాక్ బెల్ట్ పొందారు పవన్ కళ్యాణ్. తన కరాటే స్కిల్స్ ని తమ్ముడు చిత్రంలో చూపించారు. అలాగే అక్కడ జరిగిన సంఘటన బేస్ చేసుకునే తమ్ముడు సినిమాలో ఓ సీన్ పెట్టారు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి రాత్రి మొత్తం వర్షంలో తడుస్తూ తనకి కిక్ బాక్సింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సింబాలిక్ గా మాస్టర్ కి చూపిస్తారు. ఇది చెన్నైలో కరాటే గురువు దగ్గర పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో జరిగిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ఆ తర్వాత గోకులంలో సీత,సుస్వాగతం, తొలిప్రేమ,తమ్ముడు వంటి సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు.అయితే ఈయన తొలిప్రేమ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమా తమ్ముడు అని చెప్పుకోవచ్చు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అని తెలుసు. ఎన్నో సినిమాల్లో మార్షల్ ఆర్ట్ట్స్ ( Martial Arts ) స్టైల్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ ( Karate Black Belt ) సాధించిన పవన్ కళ్యాణ్‌కు తొలూత మార్షల్ ఆర్ట్స్ అంటే అంత ఇష్టం ఉండేది కాదట. పైగా నాగబాబు ( Nagababu ) కూడా చినప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని సలహా ఇస్తే అలాంటివి నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడట.
అయితే కాలేజీలో చేరాక అక్కడి విద్యార్థులు కొంత మంది చిరంజివి ( Chiranjeevi )మూవీస్ గురించి అవహేళనగా కామెంట్ చేశారట. దాంతో పవన్ కళ్యాణ్‌కు కోపం వచ్చి వారిని ఎలాగైనా కొట్టాలి అనుకున్నాడట. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
‘ఖుషి’ (Kushi), ‘అన్నవరం’ (Annavaram) సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే సీన్లలో వేసే డ్రస్సులో ఆయన కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ముఖ్యంగా ‘ఖుషి’ సినిమాలో ఫస్ట్ ఫైట్ వచ్చే ముందు ఎలా అయితే కనిపించాడో.. సేమ్ టు సేమ్ అలా ఓజీలో కనిపిస్తుండటంతో.. ఆ మూవీ పిక్‌ని షేర్ చేస్తూ.. ‘ఓజీ’తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.