షేకింగ్ న్యూస్: ‘కల్కి’లో ముగ్గురు తెలుగు సెలబ్రిటీ డైరక్టర్స్ క్యామియో.. ? వాళ్లు ఎవరంటే

Published : Jun 10, 2024, 06:59 AM IST

 ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా జూన్‌ 26నే విడుదల కానుంది. అక్కడ దీని అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

PREV
111
 షేకింగ్ న్యూస్: ‘కల్కి’లో ముగ్గురు తెలుగు సెలబ్రిటీ డైరక్టర్స్ క్యామియో.. ? వాళ్లు ఎవరంటే

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో క్యామియో పాత్రల్లో కనిపించనున్న ముగ్గరు తెలుగు డైరక్టర్స్ హాట్ టాపిక్ గా మారారు. ఎవరు వాళ్లు?

211

 ప్రభాస్‌ (prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల కాబోతోంది. అలాగే రిలీజ్ డేట్ సైతం దగ్గరపడింది. ఈ నేపధ్యంలో ఈచిత్రం విశేషాలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 
 

311

తాజాగా అమితాబ్ తన బ్లాగ్‌లో షేర్‌ చేసిన ఓ అప్‌డేట్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ‘మరో బిజీ డే. నా అప్‌కమింగ్‌ సినిమాలోని పాటకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాను. త్వరలోనే అది మీ ముందుకు రానుంది’ అని తెలిపారు. దీంతో కల్కి (Kalki 2898 AD) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే అని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రబృందం కూడా అమితాబ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను పంచుకొని జూన్‌ 10న ట్రైలర్‌ రానున్నట్లు తెలిపింది. 

411

 ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా జూన్‌ 26నే విడుదల కానుంది. అక్కడ దీని అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ అమ్ముడయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం.
 

511

తాజాగా ఇందులో కీలకమైన బుజ్జి వాహనాన్ని ఆవిష్కరించారు. ఆ వెహికల్‌ను పలు నగరాల్లో నడుపుతూ టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. చెన్నై వీధుల్లో ‘బుజ్జి’ (Bujji) చేసిన సందడికి సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేయాలంటూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon musk)ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌  కోరారు. ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆయన్ను ఆహ్వానించారు. 
 

611

 భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఆలోచించే మెషీన్‌.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో భైరవ, బుజ్జి అసలు ఎలా కలిశారన్న పాయింట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నాగ్‌ అశ్విన్‌ టీమ్‌ సరికొత్త పంథాను అనుసరించింది.  బుజ్జి, భైరవకు సంబంధించిన స్పెషల్‌ వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Bujji and Bhairava on Prime)లో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యింది. 
 

711

కార్గో షిప్‌లో బుజ్జి, కాశీ పట్టణంలో భైరవ ఇలా రెండు పాత్రలు, వాటి స్వభావాలను తొలి ఎపిసోడ్‌లో పరిచయం చేసి, ఇద్దరూ కలిసి ఏం చేశారన్నది రెండో ఎపిసోడ్‌లో చూపించారు. ప్రభాస్‌ పాత్రకు యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ జోడించడం బాగుంది. మధ్యలో బ్రహ్మానందం పాత్ర చెప్పే డైలాగ్‌లు నవ్వులు పంచుతాయి. 

811

 నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) మాట్లాడుతూ.. ‘‘కల్కి’సినిమా చూశాక ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే భావనలో ఉంటారు. నేను ‘అవతార్‌’ చూశాక అలాంటి అనుభూతే పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ‘కల్కి’ (Kalki Movie) చూశాక థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కోసం పెట్టాం. వీటిలో ఎలాంటి మార్పులు చేయం’ అని స్పష్టం చేశారు.  
 

911

ప్రభాస్ మాట్లాడుతూ... ‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్నిస్తుంది’ అని ప్రభాస్‌ అన్నారు.
 

1011

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో టాలీవుడ్‌ కు చెందిన ముగ్గురు డైరెక్టర్స్  అతిథి పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్ పేరిట సమాచారం నెట్టింట తెగ షేర్‌ అవుతోంది. వాళ్లు ఎవరూ అంటే రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, జాతిరత్నాలు అనుదీప్. వీళ్ల ముగ్గురూ ఈ సినిమాలో గెస్ట్ పాత్రల్లో కనిపించి అలరించనున్నారు. 

1111

అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో గెస్ట్ లు గా కీలకమైన సీన్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఇమేజ్‌లంటూ.. కొన్ని ట్విటర్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే, నిర్మాతలు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.   తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
  

Read more Photos on
click me!

Recommended Stories