
నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. సీనియర్లలో ఆ నలుగురిలో ఒకరిగా రాణిస్తున్నారు.ప్రస్తుతం మాత్రం వరుస విజయాలతో క్రేజ్ విషయంలో చిరంజీవిని దాటేస్తుండటం విశేషం. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి యమ జోరులో ఉన్నారు బాలయ్య.
ఈ ఆనంద సమయంలో ఆయన నేడు(జూన్ 10) బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది బాలయ్యకి చాలా స్పెషల్ బర్త్ డే అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న సినిమాల అప్‌డేట్లు రాబోతున్నాయి. ఎన్బీకే109 టైటిల్ టీజర్‌తోపాటు బోయపాటితో చేసే సినిమా ప్రకటన రాబోతుంది. అంతేకాదు ఈ సందర్భంగా బాలయ్య ఆస్తుల విషయలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ విషయాలు తెలుసుకుంటే.
బాలకృష్ణకి మొత్తం ఆస్తులు సుమారు మూడు వేల కోట్లు ఉంటాయని సమాచారం. ఇందులో తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఎన్టీఆర్ థియేటర్లు, హోటల్స్, స్టూడియోలు, ఇళ్లు కొన్నారు. వీటితోపాటు వందల ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి. ఎన్టీఆర్‌కి ఎనిమిది మంది కొడుకులు. ఆయా ఆస్తులను కొడుకు పంచుకున్నారు. అయితే ఇప్పటికీ చెన్నైలో ఇళ్లు ఉందట. దాన్ని అమ్మకానికి పెట్టారు.
మరోవైపు హైదరాబాద్‌లో రామకృష్ణ స్టూడియో ఉంది. ఇందులో అందరికి వాటా ఉంది. నాచారంసమీపంలో కొన్ని ఎకరాల్లో ఈ స్టూడియో ఉండటం విశేషం. దీని విలువల వేల కోట్లల్లో ఉంటుంది. నాచారం సమీపంలో ఎన్టీఆర్ అప్పట్లో కొన్ని వందల ఎకరాలు కొనేశారు. అందులో చాలా వరకు అమ్మేశారని, కొన్నిఇళ్లు నిర్మించారని టాక్. అందులో స్టూడియో మాత్రం ఇప్పటికీ అలా ఉంచేశారు. ఇలా బాలయ్యకి వారసత్వంగానే వందల కోట్ల ఆస్తులు వచ్చాయి.
దీంతోపాటు బాలయ్యకి హైదరాబాద్‌లో రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడి ఇంటి సమీపంలోనే ఓ లగ్జరీ హౌజ్ ఉంది. దీంతోపాటు ఇటీవల సుమారు 35కోట్లతో మరో కొత్త ఇళ్లు కొన్నారట. దీనికి కొనడానికి 15కోట్లు అయితే రిజిస్ట్రేషన్ కోటి, ఇళ్లుని మాడిఫికేషన్ చేయడానికి 16కోట్లు అయ్యాయట. ప్రస్తుతం దాని వ్యాల్యూ యాభై కోట్ల వరకు ఉంటుంది. మరో ఇళ్లుని కలుపుకుంటే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు వంద కోట్ల వ్యాల్యూ చేస్తాయని అనధికారిక సమాచారం.
మరోవైపు బాలయ్యకి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆ మధ్య కూతురు నారా బ్రహ్మాణి.. బాలయ్యకి బెంట్లే కారుని గిఫ్ట్ గా ఇచ్చింది. దీని విలువ నాలుగు కోట్లు ఉంటుంది. దీంతోపాటు బెంజ్ కారు, బీఎండబ్ల్యూ, ఆడి కార్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు ఇరవై కోట్ల వరకు ఉంటాయి. అయితే బాలయ్య కార్లకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వరని, కేవలం అవసరం కోసం మాత్రమే వాడతారని తెలుస్తుంది.
దీంతోపాటు హైదరాబాద్‌లో బాలయ్యకి ల్యాండ్లు ఉన్నాయట. హైదరాబాద్ శివారులో ఉంటాయని తెలుస్తుంది. ఏపీలోనూ భారీగానే ల్యాండ్లు ఉన్నాయని అంటారు(సోషల్ మీడియా సమాచారం). ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికల్లో బాలయ్య ఆస్తుల వివరాలు ఎన్నికల కమీషన్‌కి వెళ్లడించారు. ఇందులో తన పేరుతో 81.63కోట్ల ఆస్తి ఉన్నట్టు, ఆయన భార్య వసుంధర పేరు మీద రూ.140 కోట్ల 38 లక్షల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా చూపించారు.
దీంతోపాటు అప్పులకు సంబంధించి బాలకృష్ణకు రూ.9 కోట్లు 9 లక్షల 22 వేలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలుగా చూపించడం గమనార్హం. ఇవన్నీ అధికారికంగా ఆయన చూపించినవి, కానీ అనధికారికంగా సుమారు మూడు వేల కోట్లు ఉంటుందని టాక్. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.