Allu Sirish: ఎంగేజ్‌మెంట్‌ ప్రకటించిన అల్లు శిరీష్‌, తన కాబోయే భార్య నయనిక ఎవరో తెలుసా? వదినే అంతా సెట్‌ చేసిందా?

Published : Oct 02, 2025, 08:58 AM IST

అల్లు శిరీష్‌ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. తనకు కాబోయే భార్యని పరిచయం చేశారు. తన ప్రియురాలి పేరుని మాత్రమే వెల్లడించిన శిరీష్‌ ఈ నెల 31న ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నట్టు తెలిపారు. మరి ఇంతకి నయనిక ఎవరో తెలుసా? 

PREV
15
పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన అల్లు శిరీష్‌

అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అల్లు అర్జున్‌ తమ్ముడు శిరీష్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ని ప్రకటించారు. బుధవారం లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని తనకు కాబోయే భార్య పేరుని వెల్లడించారు. అంతేకాదు ఎంగేజ్‌మెంట్‌ తేదీని ప్రకటించారు. అక్టోబర్‌ 31న నయనికతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నట్టు  తెలిపారు. ఈ మేరకు అల్లు శిరీష్‌ ఒక ఎమోషన్‌ నోట్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

25
అక్టోబర్‌ 31న నయనికతో ఎంగేజ్‌మెంట్‌

ఇందులో అల్లు శిరీష్‌ చెబుతూ, 'ఈ రోజు మా తాత అల్లు రామలింగయ్య జయంతి. నా హార్ట్ కి బాగా దగ్గరైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇదే మంచి సమయంగా భావిస్తున్నా. నేను, నయనిక ఈ నెల 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నాం. నేను పెళ్లి చేసుకోవాలని మా నానమ్మ ఎప్పుడూ కోరుతుండేది. ఆమె ప్రస్తుతం మా మధ్య లేకపోయినా, తన ఆశీస్సులు మాపై ఉంటాయి` అని ఒక నోట్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు అల్లు శిరీష్‌. ఈ సందర్భంగా ఆయన తన కాబోయే భార్యతో ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్టుపై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

35
అల్లు శిరీష్‌ కాబోయే భార్య నయనిక ఎవరంటే?

ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు శిరీష్‌ మ్యారేజ్‌ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. నెటిజన్లు ఆమె డిటెయిల్స్ కోసం సోషల్‌ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నయనిక హైదరాబాద్‌ బేస్డ్ వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తోంది. అంతేకాదు వదిన, అన్న అల్లు అర్జున్‌ భార్య అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువు అని సమాచారం. ఆమెనే ఇదంతా సెట్ చేసిందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. అంతేకాదు ఈ ప్రకటన కార్డ్ ని అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బన్నీ కూడా పోస్ట్ చేశారు. అయితే అల్లు శిరీష్‌ ఈ పోస్ట్ పెట్టే సమయంలో, తన స్నేహారెడ్డి కూడా పారిస్‌లోనే ఉన్నట్టుగా ఆమె ఇన్‌స్టా స్టేటస్‌ ని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఒక అబ్బాయి చేయి, అమ్మాయి చేయిని టేబుల్‌పై చూపించారు, వైన్‌, ఐస్‌ క్రీమ్‌ తీసుకుంటున్నట్టుగా ఉంది. ఇది శిరీష్‌, నయనికదే అనిపిస్తోంది. ఈ క్లూనే నయనిక .. అల్లు స్నేహారెడ్డికి దగ్గర అని అనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది. అయితే వీరిద్దరు ఇప్పుడు లవ్‌లో ఉన్నట్టు సమాచారం. చాలా కాలంగా ప్రేమించుకుని, ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారని టాక్. ఇందులో నిజమెంతా అనేది తెలియాలి.

45
అల్లు శిరీష్‌ సినిమా కెరీర్‌

ఇక అల్లు శిరీష్‌ సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. ఆయన `2013లో గౌరవం చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. హీరో, ఇమేజ్‌, యాక్షన్‌ అని కాకుండా కాన్సెప్ట్ చిత్రంతో వచ్చి ఆకట్టుకున్నారు. తన ప్రత్యేకతని చాటుకున్నాడు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత `కొత్తజంట`, `శీరస్తు శుభమస్తు` చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. `ఒక్క క్షణం`, `ఊర్వశివో రాక్షసివో` చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. `ఏబీసీడీ` పెద్దగా ఆడలేదు. చివరగా ఆయన `టెడ్డీ` చిత్రంలో నటించారు. ఇది డిజప్పాయింట్‌ చేసింది. దీంతో అప్పట్నుంచి ఆయన కొత్తగా మరే మూవీని ప్రకటించలేదు. అయితే హీరోగా శిరీష్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. 

55
హీరోయిన్లతో రూమర్లు

అయితే శిరీష్‌తో గతంలో పలువురు హీరోయిన్లతో రూమర్స్ వచ్చాయి. వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త అమ్మాయి పేరుని ప్రకటించి ఆ రూమర్లకి చెక్‌ పెట్టాడు శిరీష్‌. అక్టోబర్‌ 31న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగబోతుందట. ఈ ఏడాది చివర్లో మ్యారేజ్‌ విదేశాల్లో ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్‌ మెగా నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌ అనే విషయం తెలిసిందే. శిరీష్‌కి ఇద్దరు అన్నలు అల్లు అర్జున్‌, అల్లు వెంకట్‌(బాబీ) ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories