పవన్ కళ్యాణ్ తన చివరి చిత్రం అదే కావాలని ఎందుకు అనుకున్నారో తెలుసా..మూడేళ్లు గడిచినా..

Published : Sep 02, 2023, 12:47 PM ISTUpdated : Sep 02, 2023, 12:49 PM IST

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 52వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు సునామి తరహాలో పవన్ కి బర్త్ డే విషెస్ పోస్ట్ లు చేస్తున్నారు.

PREV
16
పవన్ కళ్యాణ్ తన చివరి చిత్రం అదే కావాలని ఎందుకు అనుకున్నారో తెలుసా..మూడేళ్లు గడిచినా..

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన 52వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు సునామి తరహాలో పవన్ కి బర్త్ డే విషెస్ పోస్ట్ లు చేస్తున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

26

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారట. కరాటే లో బ్లాక్ బెల్ట్ పొందిన కొద్దిమంది నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ కి సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదు. చిరంజీవి, నాగబాబు, వదిన సురేఖ ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి వచ్చేందుకు పవన్ అంగీకరించారు. కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ కి అసలు పరీక్ష మొదలయింది. పవన్ కళ్యాణ్ కి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. 

36

సినిమా ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ మూవీ మూడేళ్లు గడిచినా ప్రారంభం కాలేదు. దీనితో పవన్ లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఇంటర్ కూడా పాస్ కాలేదు. సినిమా మొదలు కాలేదు. తోటి స్నేహితులు జీవితంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పవన్ కి అండగా నిలిచారట. నువ్వు చదివినా చదవకపోయినా మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం అని చెప్పారట. ఆ మాట పవన్ కి కొండంత బలాన్ని ఇచ్చింది. 

46

సినిమా ప్రారంభం కాకపోవడంతో బెంగుళూరులో ఒక నర్సరీ ప్రారంభించి అందులోనే సెటిల్ అవుతా అని అమ్మకి చెప్పాడట. ఇంతలోనే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి షూటింగ్ మొదలైంది. కానీ ఆ వాతావరణం, డాన్సులు, బలవంతమైన నటన పవన్ కి నచ్చేవి కాదు. అందుకే తన తొలి చిత్రమే చివరి చిత్రం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. 

56

కానీ మొహమాటం వల్ల రెండవ చిత్రానికి కూడా అంగీకారం తెలిపాడు. నెమ్మదిగా పవన్ కి సినిమా వాతావరణం అలవాటు పడింది. ఇక గెలుపైనా ఓటమైనా ఇందులోనే అని నిర్ణయించుకున్నాడు. కానీ మనసులో ఏదో మూల సినిమాల నుంచి దూరం జరగాలి అని కోరుకునే వాడు. జానీ తర్వాత సినిమాలు మానేద్దాం అని నిర్ణయించుకుంటే ఈ ఒక్క చిత్రం చేయి అని కుటుంబ సభ్యులు మరోసారి నచ్చజెప్పారు. ఒక్క చిత్రం కాస్త ఇలా కొనసాగుతూనే ఉంది అని పవన్ ఒక సందర్భంలో తెలిపారు. 

66

పవన్ కళ్యాణ్ మల్టీ ట్యాలెంటెడ్. సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తన చిత్రాలకు, చిరంజీవి చిత్రాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. పలు విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు.  

click me!

Recommended Stories