విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటగా నటించిన 'ఖుషి' చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్, సమంత రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కొంత భాగం సాగదీతకు గురైందని, కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయని అంటున్నప్పటికీ ఓవరాల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉందని అంటున్నారు.