ఆస్తులు.. అప్పులు.. పవన్ కళ్యాణ్ ఎంత కూడబెట్టారు.. వివరాలు వెల్లడించిన మెగా బ్రదర్ నాగబాబు

Published : Sep 02, 2023, 10:00 AM ISTUpdated : Sep 02, 2023, 10:02 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోట్ల మంది అభిమానులను సపాధించారు..మరి ఆయన ఆస్తులు ఎన్ని కూడబెట్టాడు. కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన.. అప్పుల్లో ఉన్నారా..? పవన్ కళ్యాణ్.. ఆస్తులు.. అప్పుల  గురించి నాగబాబు ఏం చెప్పారు...? 

PREV
18
ఆస్తులు.. అప్పులు.. పవన్  కళ్యాణ్ ఎంత కూడబెట్టారు.. వివరాలు వెల్లడించిన మెగా బ్రదర్  నాగబాబు

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్.. టాలీవుడ్ లో భారీగా  ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న స్టార్.. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ టాలీవుడ్ లో ఏ స్టార్ కు లేరనే చెప్పాలి. అయితే ఇంత మది ఫ్యాన్స్ ను సంపాధించుకున్న పవర్ స్టార్.. హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. మరి ఆయన ఆస్తులు సంగతేంటి..? ఇప్పటి వరకూ  పవర్ స్టార్ కూడబెట్టింది ఎంత...?
 

28

పవర్ స్టార్ కోట్లలో సంపాధించే సత్తా ఉంది. సినిమాలు చేస్తూ.. వందల కోట్లు కూడబెట్టవచ్చు.. కాని ఆయన ప్రజా సేవ అంటూ.. రాజకీయాలకు వచ్చాడు. మరి పాలిటిక్స్ లోకి వచ్చి.. ఇంకా ఎక్కువ సంపాధిస్తున్నారా..? లేక ఉన్నవి పోగోట్టుకుంటున్నారా..? ఇంతకీ పవర్ స్టార్ ఆస్తుల విలువ ఏంత..? ఈ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు గతంలో ఏం చెప్పారు..? 

38
Pawan Kalyan

మెగా బ్రదర్ నాగబాబు కు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఈమధ్య కాలంలో బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీలో బిజీ అవుతున్న నాగబాబు.. గతంలో ఓ సారి పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ ఆస్తుల గురించి వెల్లడించారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

48
Nagababu

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్  పిల్లల పేరు మీద ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ మనీ కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టారట...నిజమేనా అని నాగబాబుకు ప్రశ్న ఎదురయ్యింది. అందుకు ఆయన మాట్లాడుతూ.. కళ్యాణ్ బాబు జీవితం లోన్‌లతో కూడిన లగ్జరీ లైఫ్ లాంటిది. ప్రస్తుతం తన దగ్గర ఉన్న కార్లు అయినా, తను ఉంటున్న ఇల్లు అయినా అన్ని లోన్‌ల మీద ఉన్నవే అన్నారు. 
 

58

తన జీవితంలో తనకంటూ ఏది సంపాదించుకోలేదు. ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాక్టర్లలో కళ్యాణ్ బాబు కూడా ఒకరు. కాని తనకు ఉన్న  ఆస్తులు కంటే అప్పులు ఎక్కువ. పార్టీ పెట్టినప్పుడు కూడా డబ్బులు లేక పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ మనీ వాడేశాడు. ఇక తనకు మిగిలి ఉన్న ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది తను ప్రేమతో కొన్న శంకర్ పల్లి ఉన్న ఫార్మ్ హౌస్ మాత్రమే అన్నారు. 

68

పవన్ కళ్యాణ్ కి  ఫార్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడో తన కెరీర్ బిగినింగ్ లో.. సినిమా ద్వారా వచ్చిన  మొదటి 8 లక్షల డబ్బుతో ఎంతో ఇష్టంగా ఫార్మ్ ల్యాండ్ తీసుకున్నాడు.  అయితే అది కూడా ఒక సమయంలో అమ్మేయబోయాడు. నేనే అడ్డుపడ్డాను. జానీ సినిమా ప్లాప్ అయ్యిన తరువాత డిస్ట్రిబ్యూటర్ లను ఆదుకునేందుకు తనకి ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు.  
 

78
pawan naga babu

అప్పుడే ఆ ఫార్మ్ హౌస్ కూడా అమ్మేయడానికి  రెడీ అవుతుండగా.. నేనే అడ్డుకున్నాను,నువ్వు ఈ ల్యాండ్ ని వ్యవసాయం చేయడానికి ఇష్టపడి కొనుకున్నావు. అంతేగాని డబ్బు సంపాదించడానికి కాదు కదా? అని చెబితే అది  విని  అప్పుడు రియలైజ్ అయ్యాడు. అది అమ్మకుండా ఉంచాడు. ప్రస్తుతం తనకి ఉన్న ఏకైక ఆస్తి శంకర్ పల్లిలో ఉన్న ఆ ఫార్మ్ హౌస్ మాత్రమే అన్నారు నాగబాబు. 

88

అయితే కొన్ని వర్గాల సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పార్టీ కార్యక్రమాలు, సహాయాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన.. ఎంత సంపాదించినా.. 150 నుంచి 200 వందల కోట్ల వరకే ఆస్తులు ఆయనకు ఉన్నట్టు సమాచారం. ఎక్కువగా ఆయన లోన్ల మీదనే కావల్సినవి తీసుకుంటారని అంటున్నారు. పార్టీ కోసం ఆయన తన సోంత ఆస్తలు అన్ని ధారపోసినట్టు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories