పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?

Published : Apr 02, 2026, 07:40 AM IST

ఒక టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు. చిన్నప్పుడు పవన్‌ ఫస్ట్ లవ్ పై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ విషయంలో మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడో తెలుసా?

PREV
16
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ వారసత్వంలో గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆయనకంటూ.. సెపరేట్ గా అభిమానులను సంపాదించుకున్నాడు పవన్. స్టార్ హీరో రేంజ్ నుంచి.. డిప్యూటీ సీఏం వరకూ.. తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లారు. పవర్ స్టార్ లో ఎంత ఫైర్ ఉంది అనేది చాలా సందర్భల్లో వెల్లడయ్యింది. పవన్ కళ్యాణ్ టీనేజ్ నుంచి బాగా ఇష్టపడింది ఎవరిని? ఆయన ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా.. చిరంజీవి పవన్ విషయంలో ఎందుకు భయపడ్డారు.

26
సినిమాలు .. పాలిటిక్స్ బ్యాలన్స్ చేస్తూ..

హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ ను బ్యాలన్స్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో హడావిడి చేసిన పవన్ స్టార్.. అటు పాలన వ్యావహారాలు చూస్తూనే.. నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు.

36
100 సెలబ్రిటీల లిస్ట్‌లో 26వ స్థానం

ఈ నేపథ్యంలోనే పవన్‌కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ వంటి హిట్ చిత్రాలతో ఆయన ఫేమస్ అయ్యారు. 2013లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో 26వ స్థానం కూడా సంపాదించారు. ఇంతటి స్టార్‌డమ్ ఉన్న పవన్ ను ఫస్ట్ లవ్ ఎవరితోనే తెలుసా.. ఆయన గన్ తో. 

అవును గన్ అంటే పవన్ కు చాలా ఇష్టమట. ఫైరింగ్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. ఈ విషయం గురించి చిరంజీవి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ''పవన్ చిన్నప్పుడు ఎప్పుడూ నకిలీ గన్‌తో ఆడుకునేవాడు. వాడికి తుపాకులంటే పిచ్చి. ఎప్పుడూ వాటితోనే ఉండేవాడు. వాడి ప్రవర్తన చూసి, ఎక్కడ నక్సలైట్లతో కలిసిపోతాడో అని మేం చాలా భయపడ్డాం' అని చిరంజీవి చెప్పారు.

46
పవన్ గురించి భయపడ్డ చిరంజీవి..

పవన్ కళ్యాణ్ చిన్నతనం, యవ్వనంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒక టాక్ షోలో పాల్గొన్న 'మెగాస్టార్' చిరంజీవి, తన తమ్ముడి గురించి ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ఆసక్తికరమైన సంఘటనను కూడా పంచుకున్నారు. 'ఒకసారి నేను సింగపూర్ వెళ్తున్నా. ఏం కావాలో తేవాలని పవన్‌ను అడిగా. సెమీ ఆటోమేటిక్ గన్ తీసుకురా, ఇక్కడ దొరకట్లేదు అని అడిగాడు. ఆ మాట విని నేను షాక్ అయ్యాను' అన్నారు. 'ఇంకోసారి వాడు డమ్మీ గన్‌తో రైల్వే స్టేషన్‌కు వెళ్తే, పోలీసులు ఆపేశారు. ఆ తర్వాత అది డమ్మీ గన్ అని తెలిసి వదిలేశారు. వాడి గన్ పిచ్చి చూసి నక్సలైట్‌గా మారిపోతాడని చాలా భయపడ్డాం' అని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

56
పవన్ కళ్యాణ్ పస్ట్ లవ్

అంతే కాదు పవన్ కు గన్ మీద ఉన్న ప్రేమను చూసి చిరు ఆయనకు ఒక గన్ కొనిపెట్టారట. ఆ గన్ ను పవన్ చాలా ప్రేమగా చూసుకునేవాడట. పడుకునేప్పుడు కూడా వెంటే పెట్టుకునేవాడట. ఒక రకంగా పవన్ కళ్యాణ్ పస్ట్ లవ్ గన్ మీదనే అని అంటుంటారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఆ ప్రేమ పోలేదు. చిన్నతనంలో చిరంజీవి పిల్లలతో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి గురించి కూడా పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ వెల్లడించారు.

66
చిరంజీవి పిల్లలతో పవన్ కళ్యాణ్ అల్లరి

చిరంజీవి పిల్లలైన సుస్మిత, రామ్ చరణ్ మధ్య పవన్ గొడవలు పెట్టేవాడని, వాళ్లు కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేసేవాడని చిరు నవ్వుతూ చెప్పారు. 'పవన్ భవిష్యత్తులో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. కష్టాల్లో ఉన్నవారికి స్పందించే గుణం, ఏదైనా మంచి చేయాలనే తపన వాడిలో చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. అతనికి ఉన్నది అభిమానులు కాదు, భక్తులు. అందరు నటులకు అభిమానులు ఉంటారు, కానీ పవన్‌కు భక్తులు ఉన్నారు. పవన్ నటుడి కంటే గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు' అని చిరంజీవి అన్నారు. నటనతో పాటు జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు.

Read more Photos on
click me!

Recommended Stories