‘కల్కి’ ని అడ్డం పెట్టి విజయ్ పై ద్వేషం వెల్లగక్కుతూ ట్రోలింగ్, ఎందుకిలా??

First Published Jun 28, 2024, 8:09 AM IST

‘కల్కి’ (Kalki 2898 AD) సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండపై అకారణంగా కొందరు ద్వేషం వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండను ట్రోల్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఫ్యామిలీ స్టార్ మూవీ  సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమాపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు నెగెటివ్ రివ్యూలు రాశాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాకు అయినా రివ్యూ మూవీ విడుదలైన రోజు కాకుండా 3 రోజుల తర్వాత ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు.

vijay Devarakonda


సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ మూవీపై దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై విజయ్ దేవరకొండ టీమ్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. హీరో విజయ్ కూడా పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు కల్కి లో గెస్ట్ రోల్ చేయటంతో ఇప్పుడు అదే జరుగుతోంది.

Vijay Devarakonda


గురువారం రిలీజైన ‘కల్కి’ (Kalki 2898 AD) సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా హిట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అదే సమయంలో చిత్రంగా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన విజయ్ దేవరకొండపై నెగిటివిటి, ట్రోలింగ్ నడుస్తోంది. 
 

Vijay Devarakonda


కల్కి  సినిమాలో విజ‌య్ దేవరకొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించాడు. సినిమాలో విజ‌య్‌కు సంబంధించిన సీన్స్ సోష‌ల్ మీడియాలో​​ హాట్ డిస్కషన్ జరుగుతోంది. అశ్వత్థామపై(అమితాబ్​) యుద్ధం చేస్తున్న సమయంలో డైలాగులు  చెబుతూ విజ‌య్ క‌నిపించ‌గా.. ఇది చూసిన అతని అభిమానులు విజయ్ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని తెగ ప్రశంసిస్తున్నారు. అయితే అదే సమయంలో ఓ వర్గం మాత్రం విజయ్ దేవరకొండను టార్గెట్ చేసింది.
 

Vijay devarakonda

 
అర్జునుడు పాత్ర పోషించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాడీ లాంగ్వేజ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అతని లుక్..  బాగున్నా, డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని, ‘అశ్వద్ధామ’ అంటూ అతను పిలిచినప్పటికీ.. ‘అమిత్’ అంటూ అతని బ్రాండ్ డైలాగ్ తో అరిచినట్టే ఉందని, తెలంగాణ అర్జునుడు అంటూ విజయ్ దేవరకొండ పాత్ర పై ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇదికావాలని చేస్తున్న ట్రోలింగే అనిపిస్తోంది.


సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర కేవలం ఓ నిముషం లోపు మాత్రమే ఉంటుంది. అంత స్టార్ డమ్ ఉన్న విజయ్ కేవలం దర్శకుడుపై ప్రాజెక్టుపై గౌరవంతో ఈ సినిమాలో కనిపించారు. అలాగే విజయ్ దేవరకొండ, దర్శకుడు నాగ్ అశ్విన్ ఇద్దరూ స్నేహితులు కావటం కూడా విజయ్ ఈ సినిమాలో చేయటానికి కారణం. నిజానికి ఇలా ట్రోలింగ్ చేసే మెటీరియల్ అయితే సినిమాలో ఏమీ లేదు. కావాలనే అకారణంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్నారనేది నిజం.  
 


విజయ్ దేవరకొండ కల్కి చిత్రంపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగి, ప్రభాస్ అన్న, వైజయంతీ ఫిల్మ్స్, మీ అందరి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఈ ప్రేమ, విజయం మరియు శక్తికి అర్హులు. అమితాబ్ బచ్చన్ సర్, దీపికా పదుకునే, కమల్ హాసన్ సర్ లకు నా గౌరవాలు. మీరు లేకుండా కల్కి ఇలాగే ఉండేది కాదు. మనమందరం పోయిన తర్వాత కల్కి2898AD గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.  
 


అలాగే  ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘కల్కి’ టీమ్‌ను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్‌ (Prabhas), అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు (Deepika Padukone) అభినందనలు తెలిపారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారంటూ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
 

kalki


అంతర్జాతీయ స్థాయి చిత్రం. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్‌ ఇండియన్ ఫిల్మ్‌.. తెలుగు ల్యాండ్‌ నుంచి చూస్తారా? అయితే ‘కల్కి 2898 ఏడీ’ని చూడండి. నాగ్ అశ్విన్‌, ప్రభాస్‌ అన్న, వైజయంతీ మూవీస్‌తో పాటు చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉంది - నాని 


నలుమూలల నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. టీమ్‌కు శుభాకాంక్షలు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి. భారతీయ సినీ రంగంలో ‘కల్కి’ ఓ మైలురాయి. - మంచు మనోజ్‌
 


‘క‌ల్కి’ (Kalki 2898 AD)  సినిమాకు ఎవ‌డే సుబ్రహ్మణ్యం, మ‌హాన‌టి చిత్రాల ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్‌ రాబడుతున్నది. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.  
 

Latest Videos

click me!