`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెట్‌లోకి పవర్‌ఫుల్‌ లుక్‌తో పవన్‌ ఎంట్రీ.. హరీష్‌ శంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

Aithagoni Raju | Published : Sep 13, 2023 11:55 PM
Google News Follow Us

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. అంతలోనే పవన్‌ పొలిటికల్‌ ఈవెంట్‌లోకి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనుకున్నారు. కానీ పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు పవర్‌ స్టార్‌.

15
`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెట్‌లోకి  పవర్‌ఫుల్‌ లుక్‌తో పవన్‌ ఎంట్రీ.. హరీష్‌ శంకర్‌ ఎమోషనల్‌ పోస్ట్

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌కి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌ టూర్‌, మరోవైపు ఇతర సినిమాలు, మధ్యలో చోటుచేసుకునే పొలిటికల్‌ సిచ్యువేషన్స్ తో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవుతూ, ఆగుతూ సాగుతుంది. నిరంతరంగా సాగడం మాత్రం కత్తి మీద సవాల్‌ గా మారింది. చాలా గ్యాప్‌ తర్వాత సెప్టెంబర్‌ మొదటి వారంలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` షూటింగ్‌ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. మహా అయితే మూడు రోజులు షూటింగ్‌ చేశారో లేదో సడెన్‌గా బ్రేకులు పడ్డాయి. 
 

25

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్స్ డెలవప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ కావడంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పవన్‌ సడెన్‌గా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. రెండు మూడు రోజులు నిరసన తెలియజేయడం, కార్యకర్తలతో మీటింగ్‌ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దీంతో `ఉస్తాద్‌.. `కి మళ్లీ బ్రేకులు పడ్డాయి. మళ్లీ పవన్‌ ఎప్పుడు షూటింగ్‌కి వస్తాడు, ఈ గొడవలు ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. షూటింగ్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

35

ఈ నేపథ్యంలో సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు పవన్‌. బుధవారం అనూహ్యంగా `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌` షూటింగ్‌లో పాల్గొన్నారు. అభిమానులకు పెద్ద సర్ప్రైజ్‌ ఇచ్చారు. పోలీస్‌ గెటప్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సెట్‌లో సందడి చేశారు. పవన్‌ పై కీలక సన్నివేశాలను దర్శకుడు హరీష్‌ శంకర్‌ తెరకెక్కించాడు. ఈ సందర్భంగా షూటింగ్‌ సెట్‌ నుంచి పవన్‌ ఫోటోలను విడుదల చేసింది యూనిట్‌. పవన్‌ షూటింగ్‌లో అడుగుపెట్టాడని తెలిపింది.

Related Articles

45

తన బాడీ గార్డ్ తో పవన్‌ పోలీస్‌ గెటప్‌లో సెట్‌కి వస్తుండటం, మరోవైపు దర్శకుడు హరీష్‌ శంకర్‌తో సీన్‌ డిస్కస్‌ చేస్తున్న ఫోటోలున్నాయి. ఇంకోవైపు హరీష్‌ శంకర్‌ మరో ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. పవన్‌ తన భుజంపై చేయి వేసి సరదాగా, హ్యాపీగా మాట్లాడుతున్న ఫోటోలని పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎమోషన్‌ పోస్ట్ పెట్టారు. 

55

`నేను ఒకరితో మాత్రమే షరతులు లేని బంధాన్ని పంచుకున్నప్పుడు ఇంత కంటే ఇంకా ఏం అడగగలను` అని పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ని ట్యాగ్‌ చేశారు. ఆయనతో తాను షరతులు లేని అనుబంధాన్ని పంచుకుంటానని హరీష్‌ తెలిపారు. ఇందులో పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న పవన్‌ తన గ్లాస్‌లో టీ తాగుతూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా శ్రీలీల కథానాయికగా నటిస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
Recommended Photos