పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` కలెక్షన్లు ప్రకటించకపోవడానికి కారణమిదేనా? వైరలవుతోన్న హాట్‌ న్యూస్‌!

First Published | Apr 12, 2021, 6:11 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన ఈ సినిమా మూడు రోజులపాటు భారీ కలెక్షన్లని రాబట్టింది. దాదాపు అన్ని చోట్ల హౌజ్‌ఫుల్‌తో రన్‌ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కలెక్షన్లు ప్రకటించడం లేదు. అందుకు కారణం వేరే ఉందట. 

పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం కావడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఫ్యాన్స్ కి నచ్చిన ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాని బాగా ఆదరిస్తున్నారు. అన్ని ఏరియాల్లో సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ని, పవర్‌ ప్యాక్డ్ చిత్రం అనే టాక్‌ని తెచ్చుకుంటుంది. `వకీల్‌సాబ్‌` సినిమా కలెక్షన్లు సోమవారం నుంచి కాస్త పడిపోయినట్టు తెలుస్తుంది.
అయితే జనరల్‌గా ఓ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుందంటే సినిమా కలెక్షన్లు ప్రకటిస్తుంటారు. వచ్చిన దాని కంటే ఎక్కువగానే కలెక్షన్లు ప్రకటిస్తూ అందరిలోనూ పాజిటివ్‌ వైబ్స్ క్రియేట్ చేస్తుంటారు నిర్మాతలు. పోస్టర్లపై పోస్టర్లు విడుదల చేస్తూ నానా హడావుడి చేస్తుంటారు.

కానీ `వకీల్‌సాబ్‌` విషయంలో మాత్రం నిర్మాత దిల్‌రాజు అలా చేయడం లేదు. ఈ చిత్రానికి సంబంధించి కలెక్షన్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో అందరిలోనూ అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. సినిమాకి కలెక్షన్లు రావడం లేదా? పవన్‌ కళ్యాణ్‌ రేంజ్‌ వసూళ్లు రాబట్టడం లేదా? అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలు కారణం వేరే ఉందట.
`వకీల్‌సాబ్‌` కలెక్షన్లని ప్రకటించకపోవడానికి కారణం కరోనా అని తెలుస్తుంది. కరోనా ప్రభావం వల్లే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ప్రకటించడం లేదని అంటున్నారు. ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నప్పటికీ కరోనా ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో విమర్శలు రాకుండా ఉండేందుకే అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం లేదంటున్నారు. కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదవుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ సినిమా కలెక్షన్లు ప్రకటిస్తే, ఎంతగా వసూళ్లు చేస్తుందో తెలిసిపోతుంది. అభిమానాన్ని డబ్బులుగా మల్చుకుంటున్నారనే విమర్శలు వస్తాయి. అందుకే కలెక్షన్లు ప్రకటించడం లేదట.
నిజానికి కరోనాతో జనాలు బెంబెలెత్తిపోతున్నారు. ఏం తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమాకి మాత్రం ఆడియెన్స్ పోటీ పడీ మరి వెళ్తున్నారు. చాలా వరకు హౌజ్‌ఫుల్‌ అవుతున్నాయి. ఇందులో ఏ ఒక్కరికిద్దరికి కరోనా ఉన్నా అది మిగతా వారికి పాకే అవకాశం చాలా ఉంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సినిమాకి ఈ రేంజ్‌లో కలెక్షన్లు వస్తుందని చెబితే కచ్చితంగా అది వివాదంగా మారుతుంది. జనం ప్రాణాలతో చెలగాటం అనే విమర్శలొస్తాయి. ఇది కొత్త వివాదాలకు కారణమవుతుందని చిత్ర బృందం భావించి ప్రకటించడం లేదని తెలుస్తుంది.
ఇదే విషయంపై ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ స్పందించి విమర్శలు గుప్పించారు. పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నాడని, కరోనాతో విలవిలలాడుతుంటూ నీ సినిమా టికెట్లు రేట్స్ పెంచాలా?, జనాన్ని ఈ రేంజ్‌లో దోచుకుంటారా? అంటూ విమర్శించారు. అదే అఫీషియల్‌గా కలెక్షన్లు ప్రకటిస్తే ప్రతి ఒక్కరు విమర్శే ఛాన్స్ ఉంది. అందుకే చిత్ర బృందం కలెక్షన్లు చెప్పేందుకు వెనకడుగు వేస్తుందని టాక్‌.
ఇదిలా ఉంటే సినిమా శుక్రవారం విడుదలై భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇది తొలి రోజు 45కోట్ల గ్రాస్‌ని 39కోట్ల షేర్‌ని రాబట్టిందని. మూడు రోజులు(శుక్ర, శని, ఆది) కలిసి ఇప్పటి వరకు 80కోట్ల గ్రాస్‌ని, 54కోట్ల షేర్‌ని రాబట్టిందని క్రిటిక్స్‌ నుంచి వినిపిస్తుంది. ఈ లెక్కలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. కరోనా తర్వాత ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టిన చిత్రమిదే అని అంటున్నారు. దాదాపు 60శాతం వసూలు వచ్చాయని చెబుతున్నారు. పవన్‌ తన స్టామినాతో బాక్సాఫీస్‌కి బూస్టప్‌ నిచ్చారని అంటున్నారు. అయితే సోమవారం నుంచి కలెక్షన్లు బాగా పడిపోయాయని టాక్‌ వినిపిస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్‌ హీరోగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా, అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రధారులుగా నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించగా, దిల్‌రాజు నిర్మించారు. ఇది హిందీలో వచ్చిన `పింక్‌` చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

Latest Videos

click me!