Bro Movie Review: బ్రో మూవీ ప్రీమియర్ టాక్... పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కి ఫీస్ట్... అదే మైనస్!

Published : Jul 28, 2023, 02:33 AM IST

సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ ల మల్టీస్టారర్ బ్రో. జులై 28న వరల్డ్ వైడ్ భారీగా విడుదల చేశారు. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సోషియో ఫాంటసీ అంశాలతో ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. బ్రో చిత్ర ప్రీమియర్స్ ముగియగా టాక్ ఏంటో చూద్దాం...   

PREV
19
Bro Movie Review: బ్రో మూవీ ప్రీమియర్ టాక్... పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కి ఫీస్ట్... అదే మైనస్!
Bro Movie Review

కథ:
మార్కండేయ అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) స్వార్థపరుడు. తన ప్రయోజనాలు తప్ప ఇతరుల గురించి ఆలోచించడు. చివరికి సొంత ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. అలాంటి మార్క్ ఊహించని ప్రమాదంలో కన్నుమూస్తాడు. అప్పుడు గాడ్ ఆఫ్ టైం(పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇస్తారు. చనిపోయిన మార్క్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. గాడ్ ఆఫ్ టైం మార్క్ జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది? అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేదే కథ... 


 

29
Bro Movie Review

ప్రీమియర్ టాక్ ప్రకారం... ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ ఎంట్రీ హైలెట్. సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. పవన్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసే ఎలివేషన్స్ ఉన్నాయి. ఆయన డాన్సులు, టైమింగ్ జోక్స్ ఆకట్టుకుంటాయి. 

39
Bro Movie Review

ఊహించిన విధంగానే త్రివిక్రమ్ పవన్ కోసం పొలిటికల్ డైలాగ్స్ రాశారు. ముఖ్యంగా గాజు గ్లాసు మీద రాసిన డైలాగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని ప్రీమియర్ టాక్. 

 

49
Bro Movie Review

సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ సైతం ఆకట్టుకుంటుంది. మామయ్య పవన్ తో పోటీపడ్డాడు. ఆయన క్యారెక్టర్ రీత్యా కొంచెం డామినేటింగ్ గా కనిపిస్తారు. కథ,స్క్రీన్ ప్లేకి ఆడియన్స్ యావరేజ్ మార్క్స్ వేస్తున్నారు. దర్శకుడు పవన్ కళ్యాణ్ పాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో కథ అంత బలంగా సాగదంటున్నారు. 

59
Bro Movie Review

ట్రైలర్ విడుదలైనప్పుడే బ్రో చిత్ర విఎఫ్ఎక్స్ పై విమర్శలు తలెత్తాయి. బిగ్ స్క్రీన్ పైన కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అంతగా ఆకట్టుకోలేదు. పవర్ స్టార్ రేంజ్ విజువల్స్ కాదంటున్నారు. ఇది సోషియో ఫాంటసీ మూవీ నేపథ్యంలో చాలా సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ వాడినట్లు తెలుస్తోంది. అలాగే సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయంటున్నారు. 

 

69
Bro Movie Review

ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా నడిపించాడు దర్శకుడు. బ్రో క్లైమాక్స్ కన్నీరు పెట్టిస్తుంది. హీరో సాయి ధరమ్ తేజ్ కి నిజమైన లైఫ్ అంటే ఏమిటీ చెప్పే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయంటున్నారు. 
 

79
Bro Movie Review

హీరోయిన్స్ కేతిక శర్మ, ప్రియా వారియర్స్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. వాళ్లకు చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ లేదట. ప్రధానంగా సినిమా సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ మీద సాగుతుంది. 

 

89
Bro Movie Review

బ్రో మూవీ సాంగ్స్ విషయంలో థమన్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే బిజీఏం పరంగా థమన్ మెప్పించాడు అంటున్నారు. పవన్ ఎంట్రీ సీన్ తో పాటు కొన్ని సన్నివేశాలను తన మ్యూజిక్ తో థమన్ ఎలివేట్ చేశారంటున్నారు.  'జాణవులే' సాంగ్ థియేటర్స్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదని అంటున్నారు. 

99
Bro Movie Review

మొత్తంగా బ్రో మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్. పవన్ కళ్యాణ్ మేనరిజం, టైమింగ్ డైలాగ్స్, డాన్సులు ఫీస్ట్. బలమైన స్టోరీ లేకున్నప్పటికీ పవన్ ఎనర్జీతో ఫస్ట్ హాఫ్ లాగించేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అలరిస్తాయి. అయితే బలహీనమైన కథ, కథనాలు,  ఓవర్ సినిమాటిక్ సీన్స్ నిరాశపరుస్తాయి. పవన్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..బ్రో వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories