మరికొన్ని గంటల్లోనే మామ అల్లుళ్ళ రచ్చ షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తొలిసారి రాబోతున్న చిత్రం బ్రో ది అవతార్.
మరికొన్ని గంటల్లోనే మామ అల్లుళ్ళ రచ్చ షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తొలిసారి రాబోతున్న చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దీనితో ఈ చిత్రంలో విశేషాలు ఏంటి ఎలా ఉండబోతోంది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బ్రో మూవీ చూడడానికి గల 5 ఆసక్తికర కారణాలు ఇప్పుడు చూద్దాం.
26
మామ అల్లుళ్ళ కాంబినేషన్ :
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. పవన్ తన మావయ్య అయినప్పటికీ తేజు గురువుగా భావిస్తాడు. మరి తేజు, పవన్ రచ్చ ఆన్ స్క్రీన్ పై ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉంది.
36
త్రివిక్రమ్ మార్పులు :
ఇది తమిళంలో విజయం సాధించిన కథ. రీమేక్ గా తెరకెక్కుతోంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంటర్ అయి కథ స్వరూపాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ వినోదయ సీతంతో పోల్చుకుంటే బ్రో మూవీలో చాలా మార్పులు కనిపిస్తాయట. మరి త్రివిక్రమ్ చేసిన ఆ మార్పులు మ్యాజిక్ లాగా వర్కౌట్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.
46
కాల దేవుడిగా :
పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారు. నేలమీదికి వచ్చిన మోడ్రన్ కృష్ణుడిగా అలరించారు. అయితే ఈ చిత్రంలో పవన్ కాల దేవుడిగా నటిస్తున్నారు. గాడ్ ఆఫ్ టైమ్ గా పవన్ ఎలా కనిపిస్తారు.. తేజు తో కలసి కాల దేవుడు చేయబోయేది ఏంటి అనేది మరొక ఆసక్తికర అంశం.
56
సముద్రఖని దర్శకత్వం :
ఇప్పుడు నటుడిగా పాపులర్ అయిన సముద్రఖని. ఒకప్పుడు తెలుగులో శంభో శివ శంభో లాంటి ఎమోషనల్ చిత్రాలు తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బ్రో లాంటి వైవిధ్యమైన చిత్రాన్ని.. పవన్, సాయిధరమ్ తేజ్ లాంటి మాస్ హీరోలని పెట్టి ఎలా డీల్ చేశారు అనేది అందరిలో ఉత్కంఠ పెంచుతోంది.
66
సందేశం :
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం చాలాబిజీగా మారిపోయింది. అందరూ ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్నారు. సింపుల్ గా, సంతోషంగా జీవించాల్సిన మానవుడు క్షణం కూడా తీరిక లేకుండా జీవితాన్ని నరకం చేసుకుంటున్నాడు అనే అద్భుతమైన సందేశాన్ని దర్శకుడు సముద్రఖని ఈ చిత్రంతో అందంగా అందించబోతున్నాడట. ఆ సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సముద్రఖని.. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మాస్ మూమెంట్స్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.