ట్రెడిషనల్ వేర్ లో హేబా పటేల్ బ్యూటీఫుల్ లుక్.. కుమారి మత్తు చూపులకు మైమరపే..

First Published | Jul 27, 2023, 9:16 PM IST

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel)  బ్యూటీఫుల్ లుక్ లో మెరిసిపోతోంది. గ్లామర్ షో లేకుండా నిండు దుస్తుల్లో దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో ఆకట్టుకుంటోంది. 
 

నార్త్ బ్యూటీ హేబా పటేల్ తన కెరీర్ ను కన్నడ చిత్రం ‘అధ్యక్ష’తో ప్రారంభించింది. 2014లో వచ్చిన ఈ మూవీలో ఐశర్య అనే పాత్రలో నటించింది. ఆ తర్వాత ఓ తమిళం చిత్రంలో మెరిసింది. అదే ఏడాది ‘అలా ఇలా’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 

ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన `కుమారి 21ఎఫ్‌`లో నటించి తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చి  ఆకట్టుకుంది. దీంతో వరుసగా తెలుగు చిత్రాల్లోనే అవకాశాలు దక్కించుకుంది. 
 


‘ఈడోరకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’, ‘మిస్టర్’, ‘24 కిస్సెస్’ ‘ఓరేయ్ బుజ్జి’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా హిట్లు అందుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ తగ్గిపోయింది. పెద్ద సినిమా ఆఫర్లేమీ వరించలేదు. దీంతో కాస్తా గ్యాప్ తీసుకుంది.

రామ్ పోతినేని ‘రెడ్’ చిత్రంలో సడెన్ గా ఐటెం సాంగ్ తో మెరిసింది. గ్లామర్ స్టెప్పులేసిన మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదోక అప్డేట్ ఇస్తూ వస్తోంది. ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి రిజల్ట్ ను అందింది. దీంతో బుల్లితెరపైనా ఆ షోలకు హేబాను ఆహ్వానించారు. 
 

ఇప్పుడిప్పుడు మళ్లీ ఫామ్ లోకి వస్తోంది. వరసగా ఆఫర్లూ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లన్’, ‘ఆద్య’ వంటి సినిమాలు విడుదల కావాల్సి ఉంది. రీసెంట్ గా ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. జీ5లొ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ హేబా చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా మాత్రం ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. బ్లూ చుడీదార్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులతో అట్రాక్ట్ చేసింది. 

Latest Videos

click me!