ఆ మూవీ నుంచి పవన్ సేఫ్ అయ్యాడా.. లేకుంటే 'అజ్ఞాతవాసి'ని మించేదేమో ?

Published : Jun 20, 2022, 07:41 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వల్ల బిజీ అయిపోయాడు కానీ.. లేకుంటే వరుసగా సినిమాలకు సైన్ చేసే వారు. పాలిటిక్స్ కారణంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలనే ఫినిష్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

PREV
16
ఆ మూవీ నుంచి పవన్ సేఫ్ అయ్యాడా.. లేకుంటే 'అజ్ఞాతవాసి'ని మించేదేమో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వల్ల బిజీ అయిపోయాడు కానీ.. లేకుంటే వరుసగా సినిమాలకు సైన్ చేసే వారు. పాలిటిక్స్ కారణంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలనే ఫినిష్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. హరి హర వీరమల్లు ఇంకా సెట్స్ పైనే ఉంది. హరీష్ శంకర్ తో 'భవదీయుడు భగత్ సింగ్' ఇంకా ప్రారంభమే కాలేదు. 

26

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల లిస్ట్ అంటూ చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తవుతాయా.. పవన్ డేట్స్ ఇస్తారా అంటే అనుమానమే. ఈ తరుణంలో హీరో సత్యదేవ్ నటించిన 'గాడ్సే' చిత్రం గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల విడుదలైన గాడ్సే బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

36

ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తో రన్ అవుతోంది. ఈ మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత రిలీఫ్ గా ఉన్నారనే చెప్పాలి. ఒక పెద్ద డిజాస్టర్ నుంచి పవన్ తప్పించుకున్నారని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్ర కథ పవన్ ని దృష్టిలో పెట్టుకుని రాసిందట. 

46

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు గోపి గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నట్లు తెలిపారు. పవన్ బిజీగా ఉండడం వల్ల ఆయనతో సినిమా చేసే అవకాశం రాలేదు. లేకుంటే ఈ కథ తప్పకుండా వినిపించే వాడిని అని అన్నారు. 

56

పవన్ బిజీ కావడంతో సత్యదేవ్ కి బాగా సెట్ అవుతుందని భావించా. అందుకే సత్యదేవ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కించాం అని తెలిపారు. ఒకవేళ పవన్ కి గోపి గణేష్ కథ వినిపించి.. ఆయన ఓకె చేసి ఉంటే పరిస్థితి ఏంటి.. మరో బిగ్ డిజాస్టర్ పవన్ ఖాతాలో పడేది. 

66

అజ్ఞాతవాసిని మించేలా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కుప్ప కూలేది అంటూ పవన్  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సత్యదేవ్ అద్భుతమైన నటుడిలా వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన గాడ్సే మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories