Karthika Deepam: రక్తంతో నిరుపమ్ బొమ్మ గీసిన జ్వాల.. సౌందర్యకు శోభ బంపర్ ఆఫర్!

Published : Jun 20, 2022, 07:32 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. jwala preposes to nirupam with blood art in todays karthika deepam serial episode

PREV
18
Karthika Deepam: రక్తంతో నిరుపమ్ బొమ్మ గీసిన జ్వాల.. సౌందర్యకు శోభ బంపర్ ఆఫర్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జ్వాలా నీతో నేను తేల్చుకోవాలి అని నిరుపమ్ పిలుస్తే లేదు లేదు నేను వస్తాను అంటూ హిమ అడ్డుపడుతుంది.. దీంతో తింగరి ఏంటి ఇది.. నేను డాక్టర్ సాబ్ తో మాట్లాడాలి అంటుంది. ఇన్నాళ్లు చెప్పకుండా ఆపవు.. ఇప్పుడు ఏంటి తింగరి ఇలా మధ్యలోకి వస్తున్నావ్ అంటూ సీరియస్ అవుతుంది. ఆతర్వాత జ్వాలా వెళ్తే ఇప్పుడు వద్దు అన్న వినకుండా వెళ్తుంది. 
 

28

మరోవైపు సౌందర్య ఏంటో హిమ ఏం ఆలోచిస్తుందో అని అనుకుంటుంది. అప్పుడే శోభ ఎంట్రీ ఇస్తుంది.. మీతో కొంచం మాట్లాడాలి మేడమ్ అంటే ఏంటో చెప్పు అంటుంది. అప్పుడే శౌర్య గురించి శోభ చెప్తుంది. మీ మరో మనవరాలు ఎక్కడ ఉందో నాకు తెలుసు అని సౌందర్యకు షాక్ ఇస్తుంది. అదే విషయాన్నీ హిమ వెనుక నుంచి వింటూంటుంది. 
 

38

ఎవరికి కనిపించని మనవరాలు.. నాకు కనిపించింది అంటుంది. అదంతా వింటున్న హిమ షాక్ అవుతుంది. శోభకు ఆ శౌర్య ఎవరో తెలిసిపోయిందా.. హిమ నేనే అంటూ ఫోన్ చేసింది శోభనేనా అని ఆలోచిస్తుంది. మరోవైపు నీరూపం ను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి.. మూడు ముళ్ళు పడిన వెంటనే శౌర్య మీ ముందుకు వస్తుంది అంటుంది. 
 

48

ఏంటి శోభ శౌర్య విషయాన్నీ పట్టుకొని ఇప్పుడు అమ్మమ్మను బ్లాక్ మెయిల్ చేస్తుందా అని హిమ అనుకుంటుంది.  ఇక శోభ మాటలు విన్న సౌందర్య షాక్ లో ఉంటుంది. శౌర్య రావడానికి నిరుపమ్ తో పెళ్లికు లింక్ పెట్టద్దు అంటుంది. హిమ ఎలాగో పెళ్లి వద్దు అంటుంది కదా ఎందుకు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యండి అంటుంది. 
 

58

పెళ్లి తర్వాత మీ మనవరాలు గురించి చెప్పకపోయినా.. మీ మనవరాలు రాకపోయినా ఇదిగోండి.. మీ మనవడితో పెళ్లి అయినా తర్వాత విడాకులు ఇవ్వడానికి పేపర్లు రెడీ చేసి సంతకం కూడా చేశాను అని అంటుంది. అది అంత చూస్తున్న హిమ ఫైర్ అవుతుంటుంది.. ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోకండి అంటూ శోభ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. 
 

68

ఇక మరోవైపు నిరుపమ్ శౌర్యను అనాథ ఆశ్రమానికి తీసుకువస్తాడు. నేను నీతో మాట్లాడాలి అంటే ఒక్క క్షణం అంటాడు. కానీ శౌర్య వినకుండా ప్రపోజ్ చెయ్యడం కోసం వెళ్తుంతుంది. ఆమె రక్తంతో నిరుపమ్ బొమ్మను వేసి తీసుకుని వస్తుంది. అది చుసిన నిరుపమ్ షాక్ అవుతాడు.. ఇది నా స్టైల్ డాక్టర్ సాబ్.. ఒకొక్కరు ఒక్కోలా ప్రపోజ్ చేస్తారు నేను ఇలా చేశాను అంటూ షాక్ ఇస్తుంది. 
 

78

నా లోకం మిరే.. మీరు లేకుండా నేను ఉండలేను అంటుంది.. ఇదిగోండి రక్తంతో వేసిన బొమ్మ అని ఇస్తుంది... జ్వాలా ప్రపోజ్ విన్న నిరుపమ్ మాట్లాడకుండా ఉండిపోతాడు.. మీరు నో అంటే నా గుండె పగిలిపోతుంది అని అంటే నిరుపమ్ ఆలోచనలో పడుతాడు. ఇక తర్వాత సీన్ లో హిమకు జరిగిన విషయం మొత్తం జ్వాలా చెప్తుంది. నా మనసులో మాట చెప్పేసాను అంటుంది.  
 

88

నిరుపమ్ ఏం తిరిగి మాట్లాడలేదా అని హిమ అడిగితే లేదు అంటుంది జ్వాలా.. ఆతర్వాత మా ఇద్దరి పెళ్లి నువ్వే చెయ్యాలి అని హిమను అడిగితే ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ హిమకు క్యాన్సర్ లేదన్న విషయం సౌందర్యకు తెలిసిపోతుంది. దీంతో హిమపై చేయి చేసుకొని సీరియస్ అవుతుంది. సౌర్య కోసమే ఈ నాటకం ఆడుతున్న అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories