విశాల్ ఆరోగ్యంపై జయం రవి షాకింగ్ కామెంట్స్.. అభిమానుల్లో కొత్త అనుమానాలు

First Published | Jan 10, 2025, 4:20 PM IST

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఒక్కటే టాపిక్ విశాల్ అనారోగ్యం విశాల్ కు ఏమయ్యింది అని. ఇక ఈ విషయంలో తాజాగా మరో హీరో జయం రవి కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ విశాల్ గురించి జయం రవి ఏమన్నారంటే..? 

నటుడు విశాల్

సౌత్ స్టార్ హీరో విశాల్ రీసెంట్ గా 'మద గజ రాజా' మూవీ ఈవెంట్ లో  పాల్గొన్నప్పుడు, ఆయన ఆరోగ్యం బాగాలేదని, గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితుడైన జయం రవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

'చెల్లమే' సినిమాతో హీరోగా పరిచయమైన విశాల్ ఇప్పటివరకు 25కి పైగా సినిమాల్లో నటించారు. 2023లో విడుదలైన 'మార్క్ ఆంటోనీ'  మూవీ దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో విశాల్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత హరి దర్శకత్వంలో విశాల్ నటించిన 'రత్తినం' సినిమా  యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

విశాల్ కు వైరల్ ఫీవర్

2012లో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన 'మద గజ రాజా' సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. దాదాపు  12 ఏళ్ల తర్వాత ఆ సినిమా రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది.  ఈ సినిమాలో విశాల్ కు జంటగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించగా, సంతానం హాస్య పాత్రలో నటించారు. నిర్మాతలు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఈ  మూవీ రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం ఈ చిత్రం సమస్యలు పరిష్కారమై విడుదలకు సిద్ధమైంది.


పొంగల్ రిలీజ్ మూవీ

జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 12 ఏళ్ల క్రితం ఈ చిత్రం నిర్మించినప్పటికీ, నేటి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో సోనూ సూద్, మణివణ్ణన్, సుబ్బరాజు, నితిన్ సత్య, మనోబాల, జాన్ కొక్కెన్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. 

మద గజ రాజా ఆడియో లాంచ్

ఈమూవీ  ఆడియో లాంచ్ రీసెంట్ గా  జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ ను చూసి అందరు షాక్ అయ్యారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని అప్పుడే అందరికి తెలిసింది. విశాల్ ముఖం ఉబ్బి, శరీరం సన్నబడి, చేతులు వణుకుతున్నట్లు కనిపించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పలు ఆలయాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. 

విశాల్ పరిస్థితికి కారణం?

విశాల్ ఈ పరిస్థితికి ఆయనకున్న చెడు అలవాట్లే కారణమని కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విశాల్ ను ఈ పరిస్థితికి గురిచేసింది దర్శకుడు బాలా అని ఆరోపణలు వస్తున్నాయి. 'అవన్ ఇవన్' చిత్రంలో నటించినప్పుడు విశాల్ కళ్లను బాలా కుట్టించారని, దానివల్ల విశాల్ కు తీవ్రమైన తలనొప్పి వచ్చిందని, తలనొప్పిని మరచిపోవడానికి విశాల్ కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే విశాల్ వర్గం ఈ వార్తలను ఖండించింది. వైరల్ ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని తెలిపింది.

విశాల్ ఆరోగ్యంపై జయం రవి వ్యాఖ్యలు

ఇక విశాల్ అనారోగ్యంపై స్పందించారు స్టార్ హీరో  జయం రవి. ఆయన రీసెంట్ గా   ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. "విశాల్ మళ్లీ సింహంలా తిరిగి వస్తాడు. విశాల్ కు ఇప్పుడు కలిసిరావడం లేదు. చెడు సమయం అని చెప్పవచ్చు.

కానీ విశాల్ కంటే ధైర్యవంతుడు ఎవరూ లేరు. ఆ ధైర్యం అతన్ని కాపాడుతుంది. అతను చాలా మందికి సహాయం చేశాడు. అతని మంచి మనసు వల్ల అతను త్వరలోనే మళ్లీ సింహంలా తిరిగి వస్తాడు" అని జయం రవి అన్నారు. అయితే విశాల్ ఇలా మారడానికి అతని చెడు సమయమే కారణమని జయం రవి అనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Latest Videos

click me!