గేమ్ ఛేంజర్ : సుకుమార్ కామెంట్స్ కి షాకింగ్ రియాక్షన్ ?

First Published | Jan 10, 2025, 3:41 PM IST

గేమ్ ఛేంజర్ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో సుకుమార్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా చూసిన వాళ్ళు సుకుమార్ కామెంట్స్ ని గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

director Sukumar


మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజైన సంగతి తెలసిందే. దాదాపు నాలుగేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ సోలో హీరోగా చేసి  దాదాపు ఐదేళ్లు కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది.

మరో ప్రక్క  ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబుల్ స్టార్ గా  క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. పాన్ ఇండియా మరోసారి స్టార్ డమ్ నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు. అయితే సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా ఇలా ఉందేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో సుకుమార్ కామెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.

 ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ నటనకు జాతీయ అవార్డు వస్తుందనుకున్నానని సినీ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) అన్నారు.   ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) క్లైమాక్స్‌లో చరణ్‌ నటనకు కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక (game changer pre release event) అమెరికాలో అట్టహాసంగా నిర్వహించారు. ఈవెంట్‌లో పాల్గొన్న సుకుమార్‌ మాట్లాడారు.



‘నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం ఒకట్రెండేళ్లు  ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్లతో పెద్దగా కనెక్ట్‌ అయి ఉండను. కానీ, ‘రంగస్థలం’ పూర్తయినా తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక్క హీరో చరణ్‌. అతను నా సోదరుడులాంటి వాడు. చాలా విషయాలు మా మధ్య చర్చకు వస్తాయి. మీకొక రహస్యం చెప్పాలి. 


చిరంజీవిగారితో కలిసి ‘గేమ్‌ ఛేంజర్‌’ చూశా. ఫస్ట్‌ రివ్యూ నేనే ఇస్తా.  ఫస్ట్‌ హాఫ్‌ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌. సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ చూస్తే గగుర్పాటు కలుగుతుంది. శంకర్‌గారి  సినిమాలు ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’ చూసి ఎంత ఎంజాయ్‌ చేశానో అంతలా ఈ మూవీని కూడా ఆస్వాదించా.

‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం. ఈ మూవీ క్లైమాక్స్‌ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్‌ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చాలా బాగా చేశాడు. ఈ నటనకు ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా’’ సుకుమార్‌ అని అన్నారు.
 


సినిమా రిలీజ్ అయ్యాక అందరూ సుకుమార్ కామెంట్స్ ని గుర్తు చేసుకుని...ఇదేంటి ఇలా మాట్లాడారు అంటున్నారు. అసలు సుకుమార్ సినిమా మొత్తం చూసారా..లేక ఎపిసోడ్స్ చూసి అలా అన్నారా, ఫైనల్ కట్ చూసి ఉండరు అని చెప్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ బాగానే ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ, డెప్త్, ఇంటెన్సిటీ మిస్సైందని, సుకుమార్ కామెంట్స్ విని చాలా ఎక్సపెక్ట్ చేసిన వాళ్లు నిరాశపడ్డారు.  సోషల్ మీడియాలో ఈ విషయమై డిస్కషన్ జరుగుతోంది.
  


సంక్రాంతి కానుకగా జనవరి 10న (game changer release date) ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల అయ్యింది.
 

Latest Videos

click me!