స్టార్‌ హీరోల భారీ రెమ్యూనరేషన్‌.. అసలు లెక్కలు చెప్పిన పవన్ కళ్యాణ్‌‌.. ప్రభాస్‌, ఎన్టీఆర్, చరణ్‌ల ప్రస్తావన

Published : Sep 26, 2021, 09:28 AM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) స్టార్‌ హీరోల రెమ్యూనరేషన్‌(remunaration) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పారితోషికం, కటింగ్స్ పోను ఎంత మిగులుతుంది? అనే లెక్కలు వివరించారు. హీరోయిన్ల విషయం కూడా ఆయన మాట్లాడారు. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 

PREV
17
స్టార్‌ హీరోల భారీ రెమ్యూనరేషన్‌.. అసలు లెక్కలు చెప్పిన పవన్ కళ్యాణ్‌‌.. ప్రభాస్‌, ఎన్టీఆర్, చరణ్‌ల ప్రస్తావన

సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నటించిన `రిపబ్లిక్‌` సినిమా అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఈనేపథ్యంలో సాయిధరమ్‌తేజ్‌ తన సినిమా ప్రమోట్‌ చేసుకోలేని పరిస్థితి అందుకోసం నిర్మాతల శ్రేయస్సు కోసం పవన్‌ శనివారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు. సామాజిక సందేశంతో రూపొందుతున్న సినిమా పెద్ద విజయం సాధించాలని, ఆడియెన్స్ ఆదరించాలని, నిర్మాతలు సేఫ్‌గాఉండాలని కోరుకున్నారు. 

27

ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమపై, స్టార్‌ హీరోల రెమ్యూనరేషన్స్ పై వస్తోన్న విమర్శలపై పవన్‌ స్పందించారు. రెమ్యూనరేషన్‌ లెక్కలు చెబుతూ, ప్రత్యర్థులపై ముప్పెట దాడి చేశారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. కొందరి భారీ రెమ్యూనరేషన్‌ చూపించి, లక్షల మంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలపై, రాజకీయ నాయకులపై ఆయన ఫైర్‌ అయ్యారు.
 

37

ఉదాహరణకు ఓ హీరో పది కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటే అందులో ట్యాక్స్ పది శాతం కట్ అవుతుందని, అంటే కోటీ రూపాయలు రెమ్యూనరేషన్‌ ఇచ్చే లోపే కట్‌ చేసి ఇస్తారని తెలిపారు. ఇక వచ్చిన రెమ్యూనరేషన్‌లోనూ మిగిలిన అన్ని ట్యాక్స్ లు పే చేస్తే మిగిలింది ఆరున్నర కోట్లు మాత్రమే అని తెలిపారు. ఓ హీరో తీసుకునే రెమ్యూనరేషన్‌ మీదే ఒక వ్యవస్థ నడుస్తుందని, ఎంతో మందిని పోషించాలని, ఎంతో మందికి దానధర్మాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. హీరోల మెయింటనెన్సే చాలా ఉంటుందని, వెనకేసుకునేది ఏముండదని పరోక్షంగా తెలిపారు పవన్‌. తనలాంటి వాడు అన్ని ట్యాక్స్ లు పోనూ మిగిలిన డబ్బుతోనూ క్యాడర్ని మెయింటేన్‌ చేయాలని వెల్లడించారు. 
 

47

ఈ సందర్భంగా వెల్త్ క్రియేషన్‌(సంపద సృష్టి)ని ప్రస్తావించారు. వెల్త్ క్రియేషన్‌ జరిగితేనే నాలుగు రూపాయలు మాకు వస్తాయని తెలిపారు. వాటితోనే ఓ మొగులయ్య లాంటి గిరిజన కళాకారుడికి రెండు లక్షలు ఇచ్చి ప్రోత్సహించగలిగామని తెలిపారు. వెల్త్ క్రియేషన్‌ ద్వారానే కరోనా సమయంలో రెండు కోట్లు విరాళం అందించడం జరిగిందన్నారు. మాకు డబ్బులు వస్తేనే తన పార్టీని, క్యాడర్‌ని చూసుకోగలుగుతానని తెలిపారు. వెల్త్ క్రియేషన్‌ జరగాలని తెలిపారు పవన్‌.

57

అదే సమయంలో తాము కష్టపడితేనే డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు. `సినిమావాళ్లు కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకుంటున్నారని అర్హత లేని ప్రతి ఒక్కడూ మాట్లాడతాడు. సినిమా వాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడంలేదు. అక్రమ ప్రాజెక్ట్‌లతో, అక్రమ కంట్రాక్ట్ లతో సంపాదించుకోవడం లేదు. ఒళ్లు హునం చేసుకుని డాన్స్‌లు, ఫైట్లు చేస్తే రూపాయి వస్తుంది. ప్రభాస్‌, రానా కండలు పెంచి, కసరత్తులు చేస్తే ఓ `బాహుబలి` వచ్చింది. ఎన్టీఆర్‌ అదిరేటి స్టెప్పులు వేస్తేనే, చరణ్‌ గుర్రపు స్వారీలు చేస్తేనే డబ్బు ఇస్తున్నారు. సినిమా వాళ్లకు ఎవరూ ఊరికే డబ్బు ఇవ్వడం లేదు` అని స్పష్టం చేశారు. 

67

హీరోయిన్ల గురించి చెబుతూ, ఒక ఆడబిడ్డ హీరోయిన్‌గా రావాలంటే.. ఎక్కడి నుంచో, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని, అందరు చూస్తుండగా ఇబ్బంది పడుతూ డాన్సులు చేస్తే డబ్బులిచ్చినందుకు దాన్ని తప్పు అంటారు. ఇదేక్కడి న్యాయం. అదే రాజకీయ నాయకులు ఒక్కరు కూడా ట్యాక్స్‌ పే చేయరని, కానీ వందల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారని, వాటికిట్యాక్సులు ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. దేన్నైనా తెగేదాక లాగొద్దని హితవు పలికారు.

77

ఈ సందర్బంగా నిర్మాతల శ్రేయస్సుకోరే వాడిని అని తెలిపారు. సినిమా పరాజయం చెంది నిర్మాత నష్టపోతే తాను పారితోషికం వదిలేసుకున్నానని తెలిపారు పవన్‌. అధికారంలోకి వచ్చి ముప్పై ఏళ్లు అధికారంలో ఉండాలని, ఆస్తులు కూడబెట్టుకోవాలని రాజకీయ నాయకులు చేస్తున్నారు. అదే థియేటర్లు, సినిమా వాళ్లు వ్యాపారం చేసుకుంటే తప్పేంటన్నారు పవన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories