ఆ వీడియోతో యాంకర్ రవి గుట్టు రట్టు... ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయిన శ్రీరామ్, ప్రియాంక సింగ్!

Published : Sep 26, 2021, 12:07 AM IST

వివాదంలో ప్రియ కంటే కూడా యాంకర్ రవిదే తప్పని తెలుస్తుంది.దీనితో ఒకరి గురించి మరొకరు వెనుక మాట్లాడకండి. రవి నువ్వు ఇలా మాట్లాడతావ్ అనుకోలేదని లహరి కోప్పడ్డారు.

PREV
15
ఆ వీడియోతో యాంకర్ రవి గుట్టు రట్టు... ఎలిమినేషన్స్ నుండి సేవ్ అయిన శ్రీరామ్, ప్రియాంక సింగ్!


నామినేషన్స్ ప్రక్రియలో లహరి ప్రియను నామినేట్ చేయడం జరిగింది. అందుకు కారణంగా ప్రియ తనతో క్లోజ్ గా ఉండడం లేదని, చెప్పగా ప్రియ స్పందించారు. నువ్వు హౌస్ లోని బాయ్స్ తో బిజీగా ఉంటున్నావ్, నేను నీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కడ ఇస్తున్నావని ప్రియ సీరియస్ కామెంట్ చేశారు. 

25


నన్ను ఎవరితో చూశావని లహరి ప్రియను అడుగగా, లేట్ నైట్ బాత్రూం దగ్గర రవిని హగ్ చేసుకోవడం చూశానని ప్రియ.. లహరి రవిలపై బాంబ్ పేల్చింది. ప్రియ కామెంట్స్ దుమారం రేపగా, లహరి, రవి తీవ్ర స్థాయిలో ఆమెపై విరుచుకుపడ్డారు. 

35


ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ నాగార్జున... ప్రియ రవిలను నిలదీశాడు. అదే సమయంలో లహరిని సీక్రెట్ రూమ్ కి పంపించి, ఓ వీడియో ప్లే చేసి చూపించారు. వీడియో చూసిన లహరిని, ప్రియ, రవిలలో ఎవరు తప్పు చేశారో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు బయటికి వెళ్లి ఎవరిది తప్పు కాదో వాళ్ళని గట్టిగా కౌగిలించుకొని, తప్పు చేసినవారిని ప్రశ్నించాలని చెప్పాడు. 


 

45

ఇక ఈ వివాదంలో ప్రియ కంటే కూడా యాంకర్ రవిదే తప్పని తెలుస్తుంది.దీనితో ఒకరి గురించి మరొకరు వెనుక మాట్లాడకండి. రవి నువ్వు ఇలా మాట్లాడతావ్ అనుకోలేదని లహరి కోప్పడ్డారు. రవి సమర్ధించుకోవడానికి ప్రయత్నం చేయగా, నేను వీడియో చూశానని గట్టి సమాధానం చెప్పింది. 

55

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో ప్రియాంక సింగ్, సింగర్ శ్రీరామ్ సేవ్ అయ్యారు. ప్రియ, మానస్, లహరి ఎలిమినేషన్స్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే లహరి హౌస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. 


 

click me!

Recommended Stories