పవన్ కళ్యాణ్ నో అన్నాడు, మహేష్ బాబు, రవితేజ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు, పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన పూరీ జగన్నాథ్ సినిమాలేంటి?

Published : Mar 19, 2026, 10:12 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. అంతే కాదు కొన్ని బ్లాక్ బస్టర్ కథలను కూడా ఆయన రిజెక్ట్ చేశారు. పూరీ జగన్నాథ్ చెప్పి ఆ మూడు ఇండస్ట్రీ హిట్ కథలను పవన్ ఎందుకు చేయలేదు? ఆసినిమాలు చేసిన స్టార్స్ ఎవరు?

PREV
15
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్..

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు, భారీగా అభిమానులను కూడా సాధించుకున్నాడు పవన్ కళ్యాణ్. మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఏ హీరోకు లేదనే చెప్పాలి. మాస్ ఆడియన్స్ లో పవన్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంత కాదు. అటువంటి హీరో... తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చూశారు, బ్లాక్ బస్టర్ హిట్స్ ను సాధించాడు. అదే క్రమంలో డిజాస్టర్ సినిమాలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని అద్భుతమైన కథలు విని కూడా.. సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.

25
బ్లాక్ బస్టర్ మూవీస్ ను మిస్ అయిన పవన్

పవర్ స్టార్ ఆ సినిమాలు కనుక చేసి ఉంటే.. ఆయన కెరీర్ లో మరికొన్ని బ్లాక్ బస్టర్స్ యాడ్ అయ్యేవి. మరీ ముఖ్యంగా పవన్ తో బద్రి, గంగతో రాంబాబు లాంటి అద్భుతమైన సినిమాలు చేసిన పూరీ జగన్నాథ్.. మూడు బ్లాక్ బస్టర్ సినిమాల కథలను ముందుగా పవన్ కే నేరేట్ చేశాడట. పవర్ స్టార్ ఆ కథలను విని.. బాగున్నాయి అన్నారు తప్పించి.. చేస్తాను..చేయను అని ఏ సమాధానం చెప్పలేదట. ఈ విషయన్ని పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పూరీ జగన్నాథ్ చెప్పిన ఆ మూడు కథలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలే.. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్. ఆ కథలు ఏవో కాదు.. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి, పోకిరి.

35
పూరీ చెప్పిన మూడు కథల సంగతేంటి...?

ఈ మూడు సినిమాలు నిజానికి పవన్ కళ్యాణ్ చేయాల్సినవి. ఈ విషయం గురించి పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు ఆయన మాట్లాడుతూ.. '' నేను ముందుగా ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి సినిమాలు కథలను పవన్ గారికే చెప్పాను. 

ఆయనకోసమే ఈ కథలను రాసుకున్నాను. కథ విన్నంత సేపు ఆయన బాగా ఎంజాయ్ చేశారు. కానీ చేస్తాను.. చేయను అని మాత్రం చెప్పలేదు. కన్ ఫ్యూజన్ లో పెట్టారు. దాంతో ఆ సినిమాలు వేరే హీరోలతో చేయాల్సి వచ్చింది. రెండు సినిమాలు రవితేజతో,ఒక సినిమా మహేష్ తో చేశాము. నిజానికి పవన్ ఆ సినిమాలు చేసుంటే.. రవికి అంత పెద్ద హిట్లు పడేవి కాదు''. అని పూరి అన్నారు.

45
రవితేజతో పూరీ జగన్నాథ్ స్నేహం..

పూరీ మాట్లాడుతూ.. '' అసలు రవితేజ హీరో అవ్వాలని కాదు.. డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. నేను రవి అసిస్టెంట్ డైరెక్టర్లుగా కృష్ణవంశీ దగ్గర పనిచేశాము. అప్పుడు రవితో నేను అనేవాడిని.. నీతో మంచి సినిమాలు చేస్తాను అని. దానికి రవి నవ్వేవాడు. అది జరినప్పుడు చూసినప్పుడు అని. కానీ తరువాత అదే నిజం అయ్యింది. పవన్ కళ్యాణ్ కంటే ముందు నాకు రవితేజానే తెలుసు. పవన్ తో పరిచయం తరువాత ఈ కథలను ఆయన కోసమే చెప్పాను'' అని పూరి అన్నారు.

55
పవన్ నో చెప్పాడు.. మహేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..

పవన్ మిస్ అయిన ఆ మూడు సినిమాలు ఎంత పెద్దహిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇడియట్ సినిమాలో రవితేజ పెద్ద స్టార్ గా మారాడు. ఆతరువాత అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయ్ సినిమాతో స్టార్ హీరోల సరసన నిలిచాడు రవితేజ. ఇక మహేష్ బాబుకు కెరీర్ లో అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా పోకిరి. 

ఈసినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే 75 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఈసినిమా కూడా పవన్ మిస్ చేసుకున్నారు. ఈమూడు సినిమాలు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ఎలా ఉండోదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories