దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ కి పవన్ ఫిదా, చేయి పట్టుకుని ఆ మాట చెప్పారట.. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ

Published : Sep 06, 2025, 06:49 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన ఓ సాంగ్ విని పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారట. 

PREV
15

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కోసం ఒక కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది. ఇందులో దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు స్వరాలు సమకూరుస్తున్నది రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ).

25

ఇటీవల జరిగిన SIIMA Awards 2025 వేడుకలో డీఎస్పీ ఈ సినిమాపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “ఉస్తాద్ భగత్ సింగ్ ఒక బ్లాస్ట్ అవుతుంది. ఇటీవల మేము ఒక పాటను చిత్రీకరించాము. ఆ పాటలో పవన్ కల్యాణ్ గారు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఆయన నా చేతిని పట్టుకుని, ఈ ట్యూన్ తనకు చాలా నచ్చిందని, చాలా రోజుల తర్వాత తనలో మళ్లీ ఉత్సాహంగా డ్యాన్స్ చేయాలనే కోరిక కలిగిందని చెప్పారు. ఆయన మాటలు విన్నాక నేను ఆనందంతో మంత్రముగ్ధుడయ్యాను. హరీష్ శంకర్ గారు బ్లాక్‌బస్టర్ ఎలిమెంట్స్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా ఇష్టపడతారు” అని తెలిపారు.

35

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో సినిమా పై మరింత ఉత్సాహం పెరిగింది. పవన్ కల్యాణ్ అభిమానులు ఇప్పటికే ఈ చిత్రాన్ని “గబ్బర్ సింగ్” తరహా హిట్‌గా ఊహిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్‌తోపాటు, డీఎస్పీ అందిస్తున్న సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

45

ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నాలు నటిస్తున్నారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, సినిమా రిలీజ్ డేట్‌ను ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

55

“ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్డేట్లు అభిమానుల్లో భారీ అంచనాలను రేపాయి. ఇప్పుడు డీఎస్పీ చెప్పిన విషయాలు ఈ సినిమా మ్యూజిక్‌పై మరింత హైప్‌ను సృష్టించాయి.

Read more Photos on
click me!

Recommended Stories