ఎన్టీఆర్ అప్పట్లో నటుడిగా చాలా బిజీగా ఉండేవారు. తన పిల్లలతో గడిపే టైమ్ కూడా ఆయనకు లేదు. ఎక్కువగా షూటింగ్‌ల్లోనే ఉండేవారు. ఆయన భార్య బసవతారకం అన్నీ చూసుకునేది. పిల్లలను మొత్తం ఆమెనే టేక్ కేర్ చేసేవారు. అయితే మనవళ్ల విషయంలో ఎన్టీఆర్‌కి కొంత టైమ్ దొరికింది. సీఎం అయిపోయాక, పదవి నుంచి తప్పుకున్నాక ఆయనకు ఖాళీ టైమ్ దొరికింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన మనవళ్లతో ఆడుకున్నాడట. తాజాగా ఎన్టీఆర్ ఓ చిన్నారిని ఎత్తుకొని ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆయన ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
24
ఎన్టీఆర్ చేతిలో ఉన్న మోక్షజ్ఞ తేజ
ఎన్టీఆర్ తన మనవడిని ఎత్తుకుని ఉన్నాడు. మరి ఈ బుడ్డొడు ఎవరనేది అభిమానులకు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఈ బుడ్డొడు ఇప్పుడు టాలీవుడ్‌లో, నందమూరి ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉన్న అబ్బాయి కావడం విశేషం. అయితే ఇంకా హీరోగా ఎంట్రీనే ఇవ్వలేదు. కానీ అప్పుడే స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ ఉండటం మరో విశేషం. అభిమానులు ఆయన కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైనా ఆయన ఎవరో గుర్తొచ్చిందా? ఈ బుడ్డోడు ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ. ఎన్టీఆర్.. మోక్షజ్ఞ తేజని ఎత్తుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. నేడు మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే చిన్నప్పుడు మోక్షజ్ఞకి ఎన్టీఆరే పేరు పెట్టారని టాక్.
34
ప్రశాంత్ వర్మతో హీరోగా ఎంట్రీ ప్రకటన, కానీ
మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ కోసం ఎంతో మంది అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యేవారు. కానీ అంతా తలక్రిందులయ్యింది. మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే బాలయ్య కూతురు తేజస్విని నిర్మాతగా మారింది. కానీ సినిమా ఆగిపోయింది. కథ విషయంలో క్రియేటివ్ డిఫరెంట్స్ వచ్చాయని, దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టు సమాచారం. తాజాగా దీనిపై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ ఈ ప్రాజెక్ట్ ని సంబంధించిన వివరాలు నిర్మాతలు ప్రకటిస్తారని తెలిపారు. కానీ ఉంటుందని మాత్రం చెప్పలేదు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈ మూవీ ఉండబోతుందని అర్థమవుతుంది.
మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎప్పుడు ఉంటుంది? ఏ దర్శకుడితో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే బాలయ్య `ఆదిత్య 999` మూవీని చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉంటుందని సమాచారం. మరి అందులో నిజం ఎంతా అనేది చూడాలి. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ తేజ సినిమా ఉండబోతుందని అన్నారు. దీనిపై కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే నేడు తన 31వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు మోక్షజ్ఞ తేజ. ఈ సందర్భంగానైనా కొత్త సినిమా అప్ డేట్ వస్తుందని ఆశించారు. కానీ చూడబోతుంటే ఎలాంటి అప్ డేట్ లేదని తెలుస్తోంది. .