పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం భారీ చిత్రాలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ‘వినోదయసీతమ్’ PKSDT చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.
ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి Original Gangstar (OG)గా వర్క్ టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈనెల 15న నుంచి చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’సెట్స్ లో అడుగుపెట్టారు. ముంబైలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా మరో పవర్ ఫుల్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల ట్రెండీ వేర్స్ లో మాస్ అండ్ స్టైలిష్ గా దర్శనమిస్తున్న పవర్ స్టార్ తాజా లుక్ తో ఆకట్టుకున్నారు. బ్లూ జీన్స్, బ్లాక్ షర్ట్ ధరించి క్యారవాన్ కు ఒరిగి పోన్లో మాట్లాడుతూ కనిపించారు.
పవన్ కళ్యాణ్ లో సెట్స్ లో చాలా సందడిగా ఉండటం యూనిట్ మొత్తానికి ఎనర్జీని ఇస్తున్నదని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటో కొద్ది క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది. పవన్ నయా లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. పవన్ కళ్యాణ్‌కి జోడీగా తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా చేయబోతోంది. చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్టు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.