ఐటం సాంగ్ కోసం అంత డిమాండ్ చేసిందా..? హాట్ టాపిక్ గా శ్రీయా శరణ్ రెమ్యునరేషన్..

First Published | Apr 20, 2023, 5:29 PM IST

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వన్నె తగ్గడంలేదు..స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్. పెళ్లై పిల్లలు పుట్టినా...అదేహాట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది బ్యూటీ. ఇక ప్రస్తుతం శ్రీయా రెమ్యూనరేషన్ గురించి ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..? 

స్టార్‌ హీరోయిన్‌ గా టాలీవుడ్ లో  క్రేజ్‌ సంపాదించుకుంది శ్రియాశరణ్ . హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన తరువాత కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గించకుండా సీనియర్ హీరోల సరసన మెరుస్తోంది. కొన్నాళ్ళు గ్యాప్ఇచ్చినా.. ఆ  తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. 
 

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో  ఇలా లైమ్ లైన్ లో ఉన్న అతి తక్కువ మంది  టాలెంటెడ్ హీరోయిన్లలో  శ్రియాశరణ్ కూడా ఒకరు.  యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టి 20 ఏళ్లు దాటినా.. అదే బ్యూటీని మెయింటేన్ చేస్తున్ ఈ భామ తెలుగు, తమిళం, హిందీతోపాటు కన్నడ, మలయాళ  భాషల్లో సినిమాలు చేస్తూ... స్టార్ ఇమేజ్ సాధించింది.  వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. 
 


Shriya Saran

తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో కూడా ఇంట్రెస్టింగ్ రోల్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది శ్రియా శరణ్‌. ఈ భామ నటించిన దృశ్యం 2 బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ విషయంలో సీనియర్ హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
 

రీసెంట్ గా ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ పాన్ ఇండియా మూవీ  కబ్జ సినిమాలో కూడా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది శ్రియా. కాగా ఈ భామకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది బ్యూటీ. అది కూడా  మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌ లో ఐటెం సాంగ్ కోసం శ్రియాను సంప్రదించారట. 
 

ఇక ఈ బ్యూటీ  ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ డిమాండ్ చేసిందట. ప్రస్తుతం ఈ టాక్‌  జోరుగా నడుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఈ విషయం టాలీవుడ్ సర్కిల్ లో తెగ పచార్లు చేస్తోంది. 
 

Shriya Saran

ఒకవేళ ఇదే నిజమైతే శ్రియా శరణ్‌ క్రేజ్‌ మరింత పెరిగి ఐకానిక్‌ స్టార్‌గా మారిపోవడం ఖాయమైనట్టే అంటున్నారు సినీ జనాలు. దీనిపై రాబోయే రోజుల్లో చిరంజీవి టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. వేదాళమ్‌ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. చిరు సోదరి పాత్రలో కీర్తిసురేశ్‌ నటిస్తోంది. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది భోళా శంకర్‌. 

Latest Videos

click me!