`ఓజీ` హీరోయిన్‌ హైదరాబాద్ లో హల్‌చల్‌.. కలర్‌ఫుల్‌ శారీస్‌తో ట్రీట్‌

Published : Feb 19, 2025, 06:03 PM IST

పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` హీరోయిన్‌ ప్రియాంక అరుల్ మోహన్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది. ఆమె కలర్‌ఫుల్‌ శారీస్‌తో కనువిందు చేసింది. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.   

PREV
15
`ఓజీ` హీరోయిన్‌ హైదరాబాద్ లో హల్‌చల్‌.. కలర్‌ఫుల్‌ శారీస్‌తో ట్రీట్‌
piyanka arul mohan

తెలుగులో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో `ఓజీ` ఒకటి. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించడం ఈ సినిమా స్పెషాలిటీ. దీనికి ఇంతటి హైప్‌కి కారణం. అయితే ఇందులో ఓజీకి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతో ప్రియాంక చాలా రోజులుగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతుంది. 
 

25
priyanka arul mohan

తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్‌లో సందడి చేసింది. ఆమె షోరూమ్ ఓపెనింగ్‌లో పాల్గొనడం విశేషం. మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్‌ నెం 45 లో గల జీటీ వీవ్స్ వారు తమ పట్టు చీరల కలెక్షన్స్ ని  హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ప్రారంభించారు.  గ్జితి మేనేజింగ్ డైరెక్టర్లు సౌజన్య, బాబీ తిక్క, టి. శ్రీనివాస్ లతో కలిసి ఆమె దీన్ని ఆవిష్కరించారు.

35
priyanka arul mohan

ఈ సందర్భంగా హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ మాట్లాడుతూ, `చీరలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. సంప్రదాయం, గాంభీర్యాన్ని సూచిస్తాయి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. చీరలపై వీరి కున్న ఫాషన్ వెల కట్టలేనిది.  గ్జితివీవ్స్ లో ఉన్నంత సేపు చీరల ప్రపంచంలో ఉన్నట్లుంది. ఆర్ట్, డిజైన్స్ చాలా బాగున్నాయి. నన్ను ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. 

ఉత్తమ చీర బ్రాండ్‌ లు సుసంపన్నమైన వారసత్వం, సంక్లిష్టమైన డిజైన్‌ లు, చీరల ప్రియుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా అగ్రశ్రేణి చీరలను అందిస్తాయి. గ్జితి వీవ్స్ అనేది డిజైనర్ చీరలకు బెస్ట్ ఆప్షన్‌` అని ప్రియాంక అరుల్ మోహన్ తెలిపారు.
 

45
priyanka arul mohan

"గ్జితి వీవ్స్ 2 సంవత్సరాల క్రితం స్థాపించాం. ఇది భారతీయ నేత జానపద కథలు, వారి దేశీయ హస్తకళ, సంస్కృతి, సాంప్రదాయ డిజైన్‌ల నుండి ప్రేరణ పొందింది. మేము దాని సంక్లిష్టమైన డిజైన్‌ల కోసం బలమైన ఖ్యాతిని సంపాదించాము. మీరు వివాహానికి హాజరైనా, అధికారిక కార్యక్రమానికి హాజరైనా, గ్జితి వీవ్స్ లుక్‌ని మెరుగుపర్చడానికి సరైన వస్త్రాన్ని అందజేస్తుంది, మేము భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి చీరలను సేకరిస్తాము` అని సౌజన్య తెలిపారు. 

55

ఇక ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఇటీవల `సరిపోదా శనివారం` చిత్రంలో నటించింది. ఇప్పుడు `ఓజీ`లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ మూవీని సాంగ్‌లో నటించబోతుంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories