ఖుషి తర్వాత సమంత నుంచి మరో చిత్రం రాలేదు. ఆమె చేతిలో ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. అయితే సమంత పూర్తిగా వెబ్ సిరీస్ లకు పరిమితం అయిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. చివరగా సమంత నుంచి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు.