Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారని టాక్. ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బాలీవుడ్ హీరోలకు వినిపించిన కథనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నారని వస్తున్న వార్తలే దీనికి కారణం.
ఓజీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చెప్పనున్నారని టాక్. ఈ క్రమంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ పవన్ అభిమానులలో కొంత అయోమయాన్ని, ఆందోళనను రేకెత్తిస్తోంది.
25
వంశీ పైడిపల్లితో చిత్రం
వారసుడు చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి ఏ కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేయలేదు. గతంలో ఆయన బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ముఖ్యంగా, అమీర్ ఖాన్ కోసం ఒక కథను సిద్ధం చేసి వినిపించినా, ఆయన ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
35
బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన అదే కథ
ఇక అదే కథను సల్మాన్ ఖాన్ వద్దకు తీసుకెళ్లగా.. మొదట ఆయన ఆసక్తి చూపినా, చివరి నిమిషంలో నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన అదే కథను వంశీ పైడిపల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్నారని వార్త వస్తున్నాయి.
ఇంతకీ ఆ కథ ఏమిటి, వంశీ పైడిపల్లి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోను సరిగ్గా డీల్ చేయగలరా అనే విషయంలో పవన్ అభిమానులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
55
బాక్సాఫీస్ సూపర్ హిట్
అటు పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బంపర్ కలెక్షన్లు రాబట్టి.. ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా నడుస్తోంది.