పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

Published : Nov 30, 2020, 07:44 AM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. 

PREV
111
పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

పవన్‌ కళ్యాణ్‌ చివరగా `అజ్ఞాతవాసి`లో కనిపించాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యాడు. పూర్తి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఒకానొక సమయంలో సినిమా చేయాలి, నటించాలనే పరిణతిని దాటిపోయానని అనిపిస్తుందన్నారు. అంటే సినిమాలు చేయడమనేది తన దృష్టిలో చిన్నదిగా కనిపించింది. కానీ ఇప్పుడు ఆయనకు సినిమాలే దిక్కయ్యాయి. 

211

ఇక రాజకీయాలు సర్దు మనగడంతో తిరిగి సినిమాలు చేయాలని భావించారు పవన్‌. డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నానని బహిరంగంగానే చెప్పాడు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, అందుకే సినిమాలు చేస్తున్నా అన్నారు. అన్నట్టుగానే వరుసగా బెట్టి సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ పోతున్నారు. 

311

తొలుత `పింక్‌` రీమేక్‌  `వకీల్‌సాబ్‌`లో నటించేందుకు సైన్‌ చేశారు. బాలీవుడ్‌లో విజయం సాధించిన చిత్రానికి రీమేక్‌. వేణు శ్రీరామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. 

411

ఈ సినిమా ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇందులో ఆయన వకీల్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా శృతి హాసన్ నటించనున్నారు. నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మెట్రోలో సినిమా కోసం ప్రయాణించి పవన్‌ సందడి చేశారు. 

511

దీని తర్వాత పవన్‌ క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి `విరూపాక్ష` అనే పేరు వినిపించింది. ఇది రాబిన్‌హుడ్‌ పాత్ర ప్రధానంగా, పీరియాడికల్‌ డ్రామాగా సాగుతుందని, ఇందులో వపన్‌ రాబిన్‌హుడ్‌ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. దీన్ని ఏం.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. 

611

దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో `గబ్బర్‌సింగ్‌` లాంటి బ్లాక్‌ బస్టర్‌ వచ్చిన విషయం తెలిసిందే. 

711

ఆ కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తూ, ఆ బ్లాక్‌ బస్టర్‌ని కూడా రిపీట్‌ చేయాలని పవన్‌, హరీష్‌ భావిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 

811

అలాగే ఇటీవల సాగర్‌ కె. చంద్ర అనే అప్‌కమింగ్‌, యువ డైరెక్టర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు పవన్‌. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` చిత్ర రీమేక్‌లో నటించబోతున్నారు. ఇది హరీష్‌ శంకర్‌ చిత్రానికి ముందే ప్రారంభం కానుంది. 

911

అలాగే `సైరా` ఫేమ్‌ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లోనూ పవన్‌ ఓ సినిమా చేసే కమిట్‌ మెంట్‌ ఉందని తెలుస్తుంది. దీన్ని పవన్‌ స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మించనున్నారు.

1011

ఈ ఐదు సినిమాలతోపాటు మరో సినిమాకి పవన్‌ తాజాగా గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. డాన్స్ మాస్టర్‌ జానీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు తాజాగా ఓకే చెప్పినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
1111

ఇందులో ఇంకా క్రేజీ న్యూస్‌ ఏంటంటే రామ్‌చరణ్‌ దీన్ని నిర్మించబోతుండటం. బాబాయ్‌ హీరోగా ఓ సినిమా చేస్తానని ఆ మధ్య తెలిపారు చరణ్‌. జానీ మాస్టర్‌ డైరెక్షన్‌లో ఉండే సినిమాని చెర్రీ నిర్మిస్తాడని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు తేలనుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆరుసినిమాలను లైన్‌లో పెట్టిన పవన్‌ అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలకు షాక్‌లు ఇస్తున్నాడన్నది మాత్రం వాస్తవం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories