పవన్ కళ్యాణ్ :
మూడు పెళ్ళిళు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ వ్యక్తిగత జీవితంతో పాటు, రాజకీయ జీవితంలో కూడా మూడు పెళ్లిళ్ల అంశం సంచలనంగా మారింది. రాజకీయాల్లో అవతలివారు ఈ పాయింట్ ను పట్టుకుని పవన్ ఇమేజ్ ను తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేశారు.
కాని ఏం చేయలేకపోయారు. ఇక విషయానికి వస్తే పవన్ ముందుగా వైజాగ్‌కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. పవన్ సినిమాల్లో రాకముందు ఈ పెళ్ళి జరిగింది. ఆతరువాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత రేణు దేశాయ్ ను ప్రేమించారు.
దాంతో నందిని తో మనస్పర్ధలు రాగా.. ఆమెకు విడాకులు ఇచ్చి.. హీరోయిన్ రేణును పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్యకాగా..కొన్నాళ్ళకు రేణుతో విడిపోయి.. డాన్సర్ కమ్ యాక్ట్రస్ అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు వీరికి కూడా ఇద్దరు పిల్లలు.