పవన్, నాగ్, మోహన్ బాబు.. రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరితో పిల్లల కనే హీరోలు వీరే!

Published : Apr 13, 2024, 07:05 PM ISTUpdated : Apr 14, 2024, 06:17 AM IST

పెళ్లి జీవితంలో ఒకసారే జరగాలి అంటారు. అయితే అనుకోని కారణాలతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావొచ్చు. అలాంటప్పుడు రెండో వివాహం చేసుకోక తప్పదు. మరి ఇద్దరు భార్యలతో వారసులు  ఉన్న హీరోలు ఎవరు? మొదటి భార్యలతో ఎందుకు విడిపోయారో చూద్దాం..   

PREV
17
పవన్, నాగ్, మోహన్ బాబు.. రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరితో పిల్లల కనే హీరోలు వీరే!

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు కావడం విశేషం.

27
Pawan Kalyan-Renu Desai

2012లో రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చారు. రష్యాకు చెందిన నటి అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఒక అబ్బాయి. అలాగే అమ్మాయి ఉన్నారు. అలా రేణు దేశాయ్, అన్నా లెజినోవాలతో ఆయన సంతానం కలిగి ఉన్నారు. 
 

37

కింగ్ నాగార్జున సినిమాల్లోకి రాకముందే వివాహం చేసుకున్నారు. నాగేశ్వరరావు-రామానాయుడు కి ఉన్న సాన్నిహిత్యం రీత్యా లక్ష్మి-నాగార్జునుల వివాహం జరిగింది. అయితే ఆ బంధం నిలవలేదు. పెళ్ళైన నాలుగేళ్లకు విడిపోయారు. వీరి సంతానం నాగ చైతన్య. 

47

అనంతరం 1992లో నాగార్జున హీరోయిన్ అమలను వివాహం చేసుకున్నారు. బెంగాలీ తండ్రి, ఐరిష్ మదర్ కి పుట్టిన అమలను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే అఖిల్. 
 

57


మోహన్ బాబు విలక్షణ నటుడిగా పేరుగాంచాడు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరో అయ్యాడు. ఆయన మొదటి భార్య విద్య దేవి మరణించింది. వారి సంతానమే మంచు లక్ష్మి, విష్ణు. 

67

మొదటి భార్య విద్యా దేవి చెల్లెలు నిర్మల దేవిని మోహన్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెకు మంచు మనోజ్ పుట్టాడు. టాలీవుడ్ లో ఈ ముగ్గురు ప్రముఖులు రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరితో పిల్లల్ని కన్నారు. 
 

77
Naresh pavitra

ఈ లిస్ట్ లో నరేష్ కూడా ఉన్నారు. విజయనిర్మల కుమారుడైన నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో ముగ్గురు కొడుకులను కన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories