అందరూ చూస్తుండగానే బట్టలు మార్చుకోవాలి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్..యాంకర్ వింధ్యకి చేదు అనుభవం

First Published Apr 13, 2024, 5:44 PM IST

ప్రముఖ యాంకర్ వింధ్య గురించి క్రికెట్ లవర్స్ కి తెలిసే ఉంటుంది. తక్కువ సమయంలోనే వింధ్య క్రికెట్ కి తెలుగులో యాంకర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. క్రికెట్ అంటే మగవాళ్లే యాంకరింగ్ చేస్తున్న సమయంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ తెలుగు అమ్మాయి.

ప్రముఖ యాంకర్ వింధ్య గురించి క్రికెట్ లవర్స్ కి తెలిసే ఉంటుంది. తక్కువ సమయంలోనే వింధ్య క్రికెట్ కి తెలుగులో యాంకర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. క్రికెట్ అంటే మగవాళ్లే యాంకరింగ్ చేస్తున్న సమయంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ తెలుగు అమ్మాయి. ఐపియల్ తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కి కూడా వింధ్య యాంకరింగ్ చేయడం బుల్లితెరపై అంతా చూసే ఉంటారు. 

వింధ్య పూర్తి పేరు వింధ్య విశాఖ మేడపాటి. ఐపియల్ 11 సీజన్ నుంచి వింధ్య క్రికెట్ యాంకరింగ్ మొదలు పెట్టింది. రీసెంట్ గా వింధ్య ఓ ఇంటర్వ్యూలో తన మోడలింగ్ రోజులని గుర్తు చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 20 మంది యాంకర్ల పోటీలో తనకి క్రికెట్ యాంకర్ గా అవకాశం ఇచ్చారట. 

అయితే చదువుకునే రోజుల్లో మోడలింగ్ అంటే ఇష్టం ఉండేదట. కానీ దానిగురించి పూర్తిగా అవగాహన లేదు. చదువు నిర్లక్ష్యం చేయకూడదు అనే తల్లి కండిషన్ ని పాటిస్తూనే మోడలింగ్ లో శిక్షణ తీసుకుందట. పలు వేడుకలపై అందాల పోటీల్లో అవార్డులు గెలుచుకున్నట్లు వింధ్య తెలిపింది. 

తొలిసారి హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నాను. అప్పటి వరకు ఫ్యాషన్ వీక్స్ గురించి నాకు అంతగా తెలియదు. ఆ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న తర్వాత ఇక మోడలింగ్ జోలికే వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. అక్కడ అమ్మాయిలు బట్టలు మార్చుకోవడానికి కనీసం గదులు కూడా లేవు. 

దీనితో అంతా చూస్తుండగానే స్టేజికి ఒక పక్కన మేమంతా బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. ఎంత ఇబ్బంది కరంగా ఉంటుందో ఊహించుకోండి అంటూ వింధ్య తెలిపింది. ఆ ఫ్యాషన్ వీక్ వాతావరణం చూశాక మోడలింగ్ నాకు కరెక్ట్ కాదని నిర్ణయించుకున్నా. 

అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్యాషన్ వీక్ అని వింధ్య తెలిపింది. అన్ని చోట్ల అలాంటి పరిస్థితే ఉంటుందని నేను చెప్పడం లేదు. కానీ నాకు మోడలింగ్ సెట్ కాదు. అలాగే సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి, గోపాల గోపాల, ముకుంద చిత్రాలకు నన్ను అడిగారు. కానీ సినీ ఫీల్డ్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అని వింధ్య పేర్కొంది. 

click me!