పవన్‌ కళ్యాణ్‌ లైఫ్‌ నే మార్చేసిన నాగార్జున నిర్ణయం.. ఆయన అది రిజెక్ట్ చేయకపోతే రేణు దేశాయ్‌ దక్కేది కాదా?

Published : Jun 02, 2024, 07:22 AM IST

పవన్‌ కళ్యాణ్‌ జీవితంలో నాగార్జున పాత్ర చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఆయన కారణంగానే ఓ సినిమా రావడం, హిట్‌ దక్కడంతోపాటు లైఫే మారిపోయింది. మరి ఆ కథేంటో చూస్తే,   

PREV
17
పవన్‌ కళ్యాణ్‌ లైఫ్‌ నే మార్చేసిన నాగార్జున నిర్ణయం.. ఆయన అది రిజెక్ట్ చేయకపోతే రేణు దేశాయ్‌ దక్కేది కాదా?

 పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్నారు. తమ్ముడు, తొలి ప్రేమ, బద్రి, ఖుషి సినిమాలు ఆయన జీవితాన్నే మార్చేశాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో టాలీవుడ్‌లో స్టార్‌ అయిపోయాడు పవన్‌. అప్పట్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ మామూలు కాదు, ఆయన స్టయిల్‌కి, మ్యానరిజంకి మాత్రమే కాదు, లవ్‌ స్టోరీల విషయంలోనూ యూత్‌లో భారీ క్రేజ్‌ వచ్చింది. 

27

ప్రారంభంలో వచ్చిన హిట్లలో `బద్రి` మూవీ పాత్ర కీలకమనే చెప్పాలి. పవన్‌ని లవర్‌ బాయ్‌గా, మాస్‌ హీరోగా మార్చిన మూవీ ఇది. ఇందులో పవన్‌ మ్యానరిజం బాగా పేలింది. ఈ సినిమాలో పవన్‌ ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తాడు. ఇదే అప్పట్లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. పూరీ జగన్నాథ్‌ అనే కుర్రాడు ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 

37

అయితే ఈ సినిమా మొదట పవన్‌ కళ్యాణ్‌ చేయాల్సింది కాదు. మన్మథుడు నాగార్జున వద్దకు వెళ్లింది. అప్పట్లో ఇలాంటి లవ్‌ స్టోరీలకు నాగ్‌ కేరాఫ్‌గా ఉన్నాడు. మన్మథుడు ఇమేజ్‌ ఆయన్ని అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మార్చేసింది. దీంతో పూరీ జగన్నాథ్.. నాగార్జునతో సినిమా చేయాలనుకున్నారు. నాగ్‌ కూడా ఓకే చెప్పారు. కానీ డేట్స్ కుదరని కారణంగా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. 
 

47

అనంతరం ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వచ్చింది. కెమెరామెన్‌ ఛోటా కె నాయుడు ద్వారా పవన్‌ని కలిశాడు పూరీ జగన్నాథ్‌. ఈ కథ చెప్పగానే పవన్‌ కి నచ్చింది.ఓకే చేశాడు, కాకపోతే క్లైమాక్స్ మార్చమని చెప్పాడట. సరే సర్‌ అని వెళ్లిన పూరీ మళ్లీ రెండు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పాడు. సేమ్‌ మొదటి రోజు చెప్పిందే చెప్పాడు, క్లైమాక్స్ లో ఎలాంటి మార్పు చేయలేదు. పవన్‌ ఏంటి సేమ్‌ చెప్పావు అని అడగ్గా, మీరు స్టోరీ సరిగా వినలేదేమో అని చెప్పాను సర్‌, క్లైమాక్స్ మార్చడం ఇష్టంలేదు అన్నాడట పూరీ. 
 

57

పూరీలోని గట్స్ కి ఫిదా అయిన పవన్‌ కళ్యాణ్‌ అసలు విషయం చెప్పాడు. నిజానికి ఆ క్లైమాక్స్ మార్చడం నాకు ఇష్టం లేదు, హీరో కోసం క్లైమాక్స్ మారుస్తావా? లేదా? ఏం చేస్తాడో చూద్దామని టెస్ట్ చేయడం కోసం చెప్పాను అన్నాడట పవన్‌. దీంతో పూరీ ముఖంలో ఆనందం వెలిగిపోయింది. సినిమా సెట్‌ అయ్యింది. పెద్ద బ్లాక్‌ బస్టర్ అయ్యింది. బద్రి బద్రినాథ్‌ అంటూ పవన్‌ చెప్పే డైలాగ్‌ కి థియేటర్లలో ఆడియెన్స్ ఊగిపోయారు. 
 

67

ఇదిలా ఉంటే ఈ మూవీ నాగ్‌ రిజెక్ట్ చేయడం వల్లే పవన్‌ కి రావడం, ఆయనకు హిట్‌ ఇవ్వడం ఓ విశేషమైతే, ఈ మూవీతోనే పవన్‌ కళ్యాణ్‌ జీవితం మారిపోయింది. ఈ సినిమాతోనే ఆయన పెళ్లి లైఫ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమని సహజీవనంగా మారింది. మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం, రేణుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కూడా కన్నారు. వీరి మ్యారేజ్‌ చాలా సంచలంగానూ మారింది. ఇప్పటికీ చర్చల్లో నిలుస్తుంది. దీనంతటికి కారణం నాగార్జున అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాగార్జుననే సినిమా చేస్తే, రేణు దేశాయ్ పవన్‌ని కలిసేది కాదు, ప్రేమలో పడేవారు కాదు. ఇదంతా జరిగే
 

77

ఇక ప్రస్తుతం పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 4తో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలురానున్నాయి. ఆ తర్వాత ఆయన సినిమాల షూటింగ్‌ అప్‌డేట్స్ రాబోతున్నాయి. ఈ నెలలోనే `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారట. అలాగే `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్ సింగ్‌` సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు పవన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories