బడ్జెట్ రెమ్యునరేషన్ కారణాలతో నాని చేయాల్సిన రెండు మూడు చిత్రాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. వాటిలో డివివి దానయ్య నిర్మించాల్సిన సుజీత్ చిత్రం ఒకటి. బడ్జెట్, రెమ్యునరేషన్ వల్ల దానయ్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. దీనితో పీపుల్స్ మీడియా సంస్థతో చర్చలు మొదలయ్యాయి. ఆ చిత్రం ఏమవుతుందో తెలియని పరిస్థితి.