మొత్తంగా వెన్నుపోటు ఘట్టం బాలకృష్ణ అన్ స్టాపబుల్(Unstoppable) షోలో చర్చకు తెచ్చారు. తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఆగస్టు సంక్షోభమని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుకున్నాను, వినలేదు. అప్పుడు ఏం జరిగిందో నీకు కూడా తెలుసుగా అని, చంద్రబాబు బాలయ్యను వెన్నుపోటు పర్వంలో వాటాదారుణ్ని చేశారు. బాలయ్య అవునని ఒప్పుకున్నారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది అన్నారు. నేను చేసింది తప్పా? అని బాలకృష్ణను నేరుగా అడిగారు. రాష్ట్రం కోసం రాజకీయ చాణక్యం ప్రదర్శించాను, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవలేదని చెప్పకనే చెప్పాడు. పరోక్షంగా ఎన్టీఆర్ అసమర్థుడు అయ్యారు, అందుకే ఆయన పదవి లాక్కున్నాను, అది మీకు కూడా తెలుసు కదా అని బాలయ్య సమక్షంలో వెన్నుపోటు మరక కడిగేశారు.