ఈరోజు ఎపిసోడ్లో రాజా, రాణి ని పిలిచి మగాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అడగగా పెళ్ళాంతో సంసారం చేయడానికి, పిల్లలు కనడానికి భార్యతో కలిసి జీవితాంతం బ్రతకడానికి అని అంటుంది. అవును ఇవన్నీ నిజమే వీటన్నింటి మించి మగవాడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అని అంటాడు రాజా. అప్పుడు వెనక్కి తిరిగి వీపు గోకు ఇందుకోసం మగాడి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళాం వీపు గోకితే ఉంటుంది అంటూ ఆనందంతో చెప్తాడు. పెళ్లికాని బ్రహ్మచార్యులు అందరికీ నేను చెప్పేది ఒకటి వెంటనే పెళ్లి చేసుకోండి పెళ్ళాంతో వీపు గోకించుకోండి అని అంటాడు.