అభిమానుల నిరీక్షణకి తెరదించుతూ.. పవన్, బాలయ్య తొలి ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ మొదలైంది. బాలయ్య పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఇక తన వ్యక్తిగత జీవితం.. 3 పెళ్లిళ్లపై పవన్ ఓపెన్ అవుతాడా ? ఇలా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. అనుకున్నట్లుగా తన పెళ్లిళ్ల గురించి బయట జరుగుతున్న చర్చకి ఎదురవుతున్న విమర్శలకు పవన్ అన్ స్టాపబుల్ వేదికగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.