హరీష్ శంకర్, మైత్రికి మంట పెడుతున్న పవన్ ఫ్యాన్స్.. 'తేరి' విషయంలో వాళ్ళ బాధ ఏంటంటే..

First Published Dec 9, 2022, 7:31 AM IST

పవన్ నటించిన చివరి రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ మూవీస్. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే రీమేక్ చిత్రాలతో విసిగిపోయారు. మరోసారి పవన్ నుంచి వాళ్ళు రీమేక్ ఆశించడం లేదు.

పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది. అయితే భవదీయుడు చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంతలోనే పవన్ కొత్త మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చి అందరిని థ్రిల్ చేసింది. 


సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్, సుజీత్ ల చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత డివివి దానయ్య నిర్మించబోతున్నారు. సుజీత్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రం రీమేక్ కాదు.. స్ట్రైట్ మూవీ. ఈ న్యూస్ పవన్ ఫ్యాన్స్ కి బిగ్ రిలీఫ్ తో పాటు సంతోషాన్ని ఇచ్చింది. 

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్ట్రైట్ గా చేయబోతున్న యాక్షన్ మూవీ ఇదే. ఈ సంతోషాన్ని ఆస్వాదించే లోపే మరో న్యూస్ పీకే ఫ్యాన్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది. త్వరలో హరీష్ శంకర్, మైత్రి మూవీస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తేరి చిత్ర రీమేక్ ప్రకటించబోతున్నారు అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. 

పవన్ నటించిన చివరి రెండు చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ మూవీస్. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే రీమేక్ చిత్రాలతో విసిగిపోయారు. మరోసారి పవన్ నుంచి వాళ్ళు రీమేక్ ఆశించడం లేదు. కానీ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టి.. తేరి రీమేక్ తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నారనే రూమర్స్ రావడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ మొదలు పెట్టారు. నిన్నటి నుంచి ' వి డోంట్ వాంట్ తేరి రీమేక్' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో టాప్ లో ట్రెండింగ్ గా నిలిచింది. తేరి రీమేక్ ప్రకటిస్తే సూసైడ్ చేసుకుంటాం అని కూడా కొందరు అభిమానులు మైత్రి సంస్థకి, హరీష్ శంకర్ కి వార్నింగ్ ఇస్తున్నారు. 

ప్రస్తుతం ఓటిటి యుగంలో రీమేక్ చిత్రాలు మునుపటిలా వర్కౌట్ కావడం లేదు. లాంగ్ రన్ ఉండడంలేదు. వీకెండ్ వరకు అభిమానులు చూస్తున్నారు కానీ ఆ తర్వాత థియేటర్స్ ఖాళీ అవుతున్నారు. ఈ విషయాన్నే అభిమానులు నొక్కి చెబుతున్నారు. ఇప్పటికే తేరి చిత్రం తెలుగులో పోలీసోడుగా రిలీజ్ అయింది. టీవీల్లో అరిగిపోయిన క్యాసెట్ లాగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇదే పవన్ అభిమానుల బాధ. 

ఇలాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం వల్ల అసలు ఉపయోగం ఉండదు. ఇటీవల గాడ్ ఫాదర్ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఒరిజినల్ వర్షన్ కంటే గాడ్ ఫాథర్ చిత్రాన్ని బాగా తీశారు అని ప్రశంసలు దక్కాయి. కానీ కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు. దానికి కారణం ఆల్రెడీ ఆ మూవీ తెలుగులో ఓటిటిలో రిలీజ్ అయింది. దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని పీకే ఫ్యాన్స్ హరీష్, మైత్రిని రిక్వస్ట్ చేయడమే కాదు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. 

click me!