Bheemla Nayak First Review:బూతులు తిడుతున్న పవన్ ఫ్యాన్స్... అజ్ఞాతవాసి సెంటిమెంట్ తలచుకొని

Published : Feb 14, 2022, 03:50 PM IST

భీమ్లా నాయక్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి భీమ్లా నాయక్ (Bheemla Nayak)థియేటర్స్ లో దిగిపోనుంది. టికెట్స్ ధరల సంగతి ఎలా ఉన్నా... నైట్ కర్ఫ్యూ ఎత్తివేసి, 100 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చిన తరుణంలో భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుంది. 

PREV
16
Bheemla Nayak First Review:బూతులు తిడుతున్న పవన్ ఫ్యాన్స్... అజ్ఞాతవాసి సెంటిమెంట్ తలచుకొని

మరోవైపు భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ (Bheemla Nayak First Review) వచ్చేసింది. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్వీట్ పడింది. భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా లేరు. పైగా సదరు రివ్యూ ఇచ్చిన వ్యక్తిని బూతులు తిడుతున్నారు. భీమ్లా నాయక్ పట్ల పాజిటివ్ గా స్పందించినా కూడా ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే... గతాన్ని నెమరు వేసుకోవాల్సిందే. 
 

26
Bheemla nayak

ఈ రివ్యూ ఇచ్చింది యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమర్ సంధు. ఈయన సౌత్ సినిమాల గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేస్తారు. సెన్సార్ సభ్యుడిగా సినిమా చూసేశాను, అద్భుతం అంటూ ట్వీట్ చేస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఈయన స్పందన ఒకేలా ఉంటుంది. సినిమాలో మేటర్ ఉన్నా లేకున్నా బంపర్ హిట్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు.

36

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉమర్ సంధును తిట్టిపోస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అజ్ఞాతవాసి చిత్రానికి ఆయన ఇచ్చిన రివ్యూ గుర్తు చేసుకుంటున్న పవన్ అభిమానులు నీ మాటలు నమ్మం అంటున్నారు. పవన్ కెరీర్ లో అట్టర్ ప్లాప్ గా నిలిచిన అజ్ఞాతవాసి చిత్రాన్ని కూడా ఉమర్ బ్లాక్ బస్టర్ అంటూ కొనియాడారు. చివరకు ఫలితం పూర్తి నెగిటివ్ గా వచ్చింది. 

46

ఇక పవన్ (Pawan Kalyan) కమ్ బ్యాక్ తర్వాత చేసిన వకీల్ సాబ్ చిత్రం కూడా అనుకున్నంత విజయం రాబట్టలేదు. రూ. 135కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినప్పటికీ... చాలా ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. వకీల్ సాబ్ భారీ విజయం సాధిస్తుంది ఉమర్ సంధు ఇచ్చిన రివ్యూ వకీల్ సాబ్ విషయంలో కూడా ఫెయిల్ అయ్యింది.

56

ఇవన్నీ మనసులో పెట్టుకున్న పవన్ ఫ్యాన్స్ ఉమర్ సంధు పై తిట్ల దండకం అందుకుంటున్నారు. నీ మాటలు ఇకపై నమ్మం అంటున్నారు. అదే సమయంలో మీరు చెప్పినా చెప్పుకున్నా, భీమ్లా నాయక్ పెద్ద విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

66


కాగా భీమ్లా నాయక్ హిందీలో కూడా విడుదల చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. పవన్ ని తన ట్వీట్స్, సినిమాలతో పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉండే వర్మ సలహా అనంతరం చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. వర్మ భీమ్లా నాయక్ హిందీలో విడుదల చేయాలంటూ వరుస ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories