ఏడాది క్రితం రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య, రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్యతో వరుణ్ పెళ్లి వార్తలు నమ్మారు. అయితే ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి వరుణ్-లావణ్య ఎఫైర్, పెళ్లి వార్తలు సద్దుమణిగాయి.