Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూశారు. గత నెలలో పవన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 'OG 2' కలిసి చూద్దామని హామీ ఇచ్చారు. ఇప్పుడా కోరిక తీరకుండానే తనువు చాలించాడు. నిరంజన్ మృతిపై నటుడు సోనూసూద్ స్పందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండ యువకుడు పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. జన్యుపరమైన వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్న నిరంజన్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. అతని మరణం కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.
26
గతంలో పరామర్శించిన పవన్ కల్యాణ్
నిరంజన్ పరిస్థితి గురించి తెలిసిన పవన్ కళ్యాణ్ గత నెలలో స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్‌ను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతనితో సెల్ఫీ దిగడంతో పాటు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.
36
ఓజీ 2 కలిసి చూద్దాం: పవన్
తనకు ఒక కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా, కొని పంపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే అదే రోజు కుక్కపిల్లను పంపించారు. దీంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని కుటుంబ సభ్యులు అప్పట్లో వెల్లడించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మరో హామీ కూడా ఇచ్చారు. తాను నటిస్తున్న 'OG 2' విడుదలయ్యాక స్పెషల్ గెస్ట్ గా తీసుకెళ్లి కలిసి సినిమా చూద్దామని నిరంజన్‌కు చెప్పారు. అయితే ఆ కోరిక నెరవేరకముందే నిరంజన్ కన్నుమూయడం ఫ్యాన్స్ ను ఆవేదనకు గురి చేసింది.
పరామర్శ సమయంలో నిరంజన్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్, వారి జీవనోపాధికి తోడ్పాటుగా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో ఆయన అభిమానులు పవన్ మానవత్వాన్ని ప్రశంసించారు.
56
స్పందించి అండగా ఉంటానన్న సోనూసూద్
నిరంజన్ మరణవార్త తెలిసిన వెంటనే నటుడు సోనూ సూద్ కూడా స్పందించారు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, అవసరమైన సహాయం కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు.
66
విధి మరోలా నిర్ణయించింది
ఈ ఘటనలో అభిమానులను ఎక్కువగా కదిలించిన అంశం ఏమిటంటే... ఒక అభిమాని కోరికను గౌరవిస్తూ అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్, అతనికి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ విధి మరోలా నిర్ణయించడంతో, 'OG 2'ను తన అభిమాన హీరోతో కలిసి చూడాలనే నిరంజన్ కల కలగానే మిగిలిపోయింది.